యాప్నగరం

పార్థీవ్‌ను కవ్వించబోయి బుక్కయిపోయిన వీరూ!

ట్విట్టర్ ద్వారా తోటి ఆటగాళ్లపై పంచ్‌లేస్తూ వార్తల్లో నిలిచే వీరేంద్ర సెహ్వాగ్ ఈసారి పార్థీవ్ పటేల్ చేతిలో బుక్కయ్యాడు.

TNN 11 Jan 2018, 6:07 pm
టీమిండియా మాజీ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్లో ఎంతలా చెలరేగిపోతాడో తెలిసిందే. తనదైన స్టయిల్ ట్వీట్లతో ఇతరుల్ని ఆటపట్టించడంలో సెహ్వాగ్ తర్వాతే ఎవరైనా. క్రికెట్ నుంచి రిటైరైనా.. కామెంట్రీ చెబుతూ, సోషల్ మీడియాలో పంచ్‌లు పేలుస్తూ వీరూ అభిమానుల్ని అలరిస్తున్నాడు. సెహ్వాగ్ ఎవరినా లక్ష్యంగా చేసుకొని ట్వీట్ చేశాడంటే నవ్వులు పూయాల్సిందే. ఎందరినో తన ట్వీట్ల ద్వారా ఆట పట్టించిన వీరూ ఇటీవలే పార్థీవ్ పటేల్‌ను ట్రోల్ చేయబోయి స్టంపౌట్ అయ్యాడు.
Samayam Telugu how parthiv patel stumped troll virender sehwag on twitter
పార్థీవ్‌ను కవ్వించబోయి బుక్కయిపోయిన వీరూ!


ప్రస్తుతం భారత జట్టుతో కలిసి దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న పార్థీవ్‌ తుది జట్టులో చోటు కోసం ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడెప్పుడు బరిలో దిగుదామా అని ఉత్సాహంలో ఉన్న పటేల్‌కు సెహ్వాగ్ ఓ ట్వీట్ చేశాడు. గ్లోవ్స్‌‌లా చేతుల ఆకారంలో ఉన్న రెండు చపాతీలను ఆ ట్వీట్‌లో ఉంచిన వీరూ.. పార్థీవ్‌ను ట్యాగ్ చేశాడు. వీటిని తీసుకెళ్లూ ఉపయోగపడతాయని సెహ్వాగ్ పార్థీవ్‌కు సూచించాడు.

नई नवेली दुल्हन आयीz पति बोला अपने हाथ की रोटी बना के खिलाओ । pic.twitter.com/9CG0LoGUlN — Virender Sehwag (@virendersehwag) January 10, 2018
వీరూ ట్వీట్‌కు వికెట్ కీపర్ అయిన పార్థీవ్ తనదైన స్టయిల్లో అంతే ఫన్నీగా బదులిచ్చాడు. భయ్యా నా దగ్గర చాలా గ్లోవ్స్ ఉన్నాయి. వాటిని నీతోనే ఉంచుకో. ఢిల్లీలో చలి ఎక్కువగా ఉంది కదా.. ఇంట్లో వాళ్లకు ఉపయోగపడతాయని బదులిచ్చాడు. దీంతో పార్థీవ్ తన హస్య చతురతతో వీరూను స్టంపౌట్ చేశాడంటూ నెటిజన్లు ట్వీట్లు చేశారు.

Idhar meri perfect size wale bahut gloves le ke aaya hu.. ise udhar hi rakhe aap..delhi mai thand Badh gayi hai to ghar me kisi ke Kaam aaynege... — parthiv patel (@parthiv9) January 10, 2018

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.