యాప్నగరం

కోహ్లి విషయంలో ఒళ్లు దగ్గరపెట్టుకోండి: హస్సీ

క్రికెట్ ప్రపంచంలో స్లెడ్జింగ్ రారాజు ఎవరంటే.. ఆస్ట్రేలియా అని టక్కున చెప్తారు ఎవరైనా!

TNN 3 Feb 2017, 3:24 pm
క్రికెట్ ప్రపంచంలో స్లెడ్జింగ్ రారాజు ఎవరంటే.. ఆస్ట్రేలియా అని టక్కున చెప్తారు ఎవరైనా! మైదానంలో ఆడుతున్న ఆసీస్ ఆటగాళ్లే కాదు.. గ్యాలరీలో కూర్చున్న ఆస్ట్రేలియా అభిమానులు సైతం ప్రత్యర్థి ఆటగాళ్లను స్లెడ్జింగ్ చేస్తారు. మంచి ఊపుమీదున్న బ్యాట్స్‌మెన్ లేదా బౌలర్‌ను సైతం తమ నోటితో ఇబ్బందిపెట్టగల సత్తా వారిది. అయితే విరాట్ కోహ్లి విషయంలో మాత్రం కొంచెం ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండాలని ఆసీస్ మాజీ ఆటగాడు మైకేల్ హస్సీ ప్రస్తుత కెప్టెన్ స్టీవ్ స్మిత్‌తో పాటు జట్టు సభ్యులను హెచ్చరించాడు.
Samayam Telugu hussey warns australia against sledging kohli
కోహ్లి విషయంలో ఒళ్లు దగ్గరపెట్టుకోండి: హస్సీ


‘మీరెంత నోరు పారేసుకుంటే కోహ్లి అంతలా రెచ్చిపోయి ఆడతాడు’ అని హస్సీ అన్నాడు. అసలే సొంత గడ్డపై ఆడుతున్న ఇండియన్ కెప్టెన్‌ను స్లెడ్జింగ్‌తో అదుపు చేయడం కష్టమని పరోక్షంగా జట్టు సభ్యులకు చెప్పాడు హస్సీ. ‘ఆస్ట్రేలియా తరఫున చూస్తే ఇక్కడి అభిమానులకు కోహ్లినే నం. 1 శత్రువు. కాబట్టి అతనికి అధిక ప్రాధాన్యం ఇవ్వకుండా వీలైనంత సులభంగా ఔట్ చేయాలి. కోహ్లి సిసలైన పోటీదారుడు. అతను తమపై ఎలా రెచ్చిపోవాలా అనే ఆలోచిస్తాడని అనుకుంటున్నా. అతనికి పోరాడటం అంటే చాలా ఇష్టం’ అని హస్సీ చెప్పుకొచ్చాడు.

టీం ఇండియాతో నాలుగు టెస్టులు ఆడేందుకు ఆస్ట్రేలియా ఈ నెలలోనే భారత్‌కు రానుంది. తొలి టెస్ట్ ఫిబ్రవరి 23న పుణేలో ప్రారంభం అవుతుంది. రెండో టెస్ట్ మార్చి 4న బెంగళూరులో, మూడో టెస్ట్ మార్చి 16న రాంచీలో, నాలుగో టెస్ట్ మార్చి 25న ధర్మశాలలో ప్రారంభమవుతాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.