యాప్నగరం

సిరాజ్‌కు అవకాశం.. భారత-ఎ జట్టుకు ఎంపిక

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 10వ సీజన్‌ వేలంలో రూ. 2.6 కోట్లు అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న హైదరాబాద్ బౌలర్ మహ్మద్ సిరాజ్ గుర్తున్నాడు కదా..

TNN 30 Jun 2017, 9:06 am
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 10వ సీజన్‌ వేలంలో రూ. 2.6 కోట్లు అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న హైదరాబాద్ బౌలర్ మహ్మద్ సిరాజ్ గుర్తున్నాడు కదా.. భారత జాతీయ జట్టుకు ఎంపిక కావాలని తహతహలాడుతున్న సిరాజ్‌కు తనను తాను నిరూపించుకునే అవకాశం వచ్చింది. ఐపీఎల్‌లో సన్‌ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడి సత్తాచాటిన ఈ యువ పేసర్‌కు దక్షిణాఫ్రికాలో పర్యటించే భారత్‌-ఎ వన్డే, టెస్టు జట్లలో చోటు లభించింది. ఆంధ్రప్రదేశ్‌ బ్యాట్స్‌మన్ హనుమ విహారి టెస్టు జట్టులో ఎంపికయ్యాడు.
Samayam Telugu hyderabad bowler siraj selected for india a team including vihari
సిరాజ్‌కు అవకాశం.. భారత-ఎ జట్టుకు ఎంపిక


ఈ మేరకు గురువారం బీసీసీఐ రెండు జట్లను ప్రకటించింది. వన్డే జట్టుకు మనీష్‌పాండే, టెస్ట్ (నాలుగు రోజుల మ్యాచ్‌) జట్టుకు కరుణ్‌ నాయర్‌ కెప్టెన్‌లుగా ఎంపికయ్యారు. పర్యటనలో భాగంగా భారత జట్టు తొలుత ఆస్ట్రేలియా-ఎ, దక్షిణాఫ్రికా-ఎ జట్లతో ముక్కోణపు సిరీస్‌ ఆడనుంది. తర్వాత దక్షిణాఫ్రికా-ఎతో రెండు టెస్టులు ఆడుతుంది. జులై 26న ముక్కోణపు సిరీస్‌ ఆరంభమవుతుంది. విజయ్‌ హజారే, ఐపీఎల్‌లో సత్తాచాటిన యువ క్రికెటర్లను వన్డే జట్టును ఎంపిక చేశారు. సిరాజ్‌తో పాటు కృనాల్‌ పాండ్య, రిషబ్‌ పంత్‌, తంపి, సిద్ధార్థ్‌ కౌల్‌లకు అవకాశం లభించింది. కాగా, సిరాజ్ ఇండియా-ఎ టీంకు సెలెక్ట్ కావడంపై కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. పాతబస్తీలో సిరాజ్ మిత్రులు సంబరాలు చేసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.