యాప్నగరం

ఐపీఎల్ తొలి మ్యాచ్‌కి హైదరాబాద్ డౌట్..?

జీతాలు చెల్లించకపోవడతో గత పది రోజుల నుంచి గ్రౌండ్స్‌మెన్ పిచ్‌ పర్యవేక్షణ చూడటం లేదు. సాధారణంగా

TNN 19 Mar 2017, 6:48 am
ఐపీఎల్‌ 10 సీజన్‌ తొలి మ్యాచ్‌కి ఆతిథ్యమిచ్చే అరుదైన అవకాశాన్ని హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం కోల్పోనుందా.. ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత ఏడాది ముగిసిన సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజేతగా నిలవడంతో ఈ ఏడాది తొలి, ఫైనల్‌ మ్యాచ్‌కి ఉప్పల్ ఆతిథ్యమిచ్చే ఛాన్స్ కొట్టేసింది. కానీ ఏప్రిల్ 5న సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనున్న సీజన్ తొలి మ్యాచ్‌ కోసం పిచ్ సన్నాహకాలు ఇంకా మొదలవలేదని సమాచారం.
Samayam Telugu hyderabad may miss out on ipl first match
ఐపీఎల్ తొలి మ్యాచ్‌కి హైదరాబాద్ డౌట్..?


హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ (హెచ్‌సీఏ) సరిగా జీతాలు చెల్లించకపోవడతో గత పది రోజుల నుంచి గ్రౌండ్స్‌మెన్ పిచ్‌ పర్యవేక్షణ చూడటం లేదు. సాధారణంగా ఒక మ్యాచ్ కోసం పిచ్‌, ఔట్ ఫీల్డ్‌ని సిద్ధం చేయాలంటే కనీసం 15 రోజులు సమయం పడుతుంది. ప్రస్తుతం హెచ్‌సీఏ పరిస్థితి చూస్తుంటే ఇప్పట్లో ఈ సమ్మె విరమించే సూచనలు కనిపించడం లేదు. షెడ్యూల్ ప్రకారం మైదానాన్ని సిద్ధం చేయలేకపోతే.. మ్యాచ్‌ని మరో వేదికకి మారుస్తారు. ఇప్పటి వరకు ఐపీఎల్ నిర్వహణలో ఉప్పల్ స్టేడియానికి మంచి పేరుంది. ఈ నెల 27న సన్‌రైజర్స్ క్రికెటర్లు ప్రాక్టీస్ కోసం హైదరాబాద్ ‌రానున్నారు. కనీసం వారికి ప్రాక్టీస్ చేసేందుకు స్టేడియంలో సరైన సదుపాయాలు కూడా హెచ్‌సీఏ కల్పించలేని పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది. ఈ సందిగ్ధత ఇలానే కొనసాగితే వేదికగా మార్చాల్సిందిగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ బీసీసీఐని కోరే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఉప్పల్ అపకీర్తిని మూటగట్టుకోవాల్సి ఉంటుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.