యాప్నగరం

ఉమేశ్ ఆఖరి బంతిని ఊహించా..! :హోప్

ఆఖరి బంతిని ఉమేశ్ యాదవ్ ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా యార్కర్ రూపంలో విసురుతాడని నేను ముందుగానే ఊహించా. దీంతో.. ఆ బంతిని హిట్ చేసేందుకు.. బ్యాటింగ్ పొజిషన్ కూడా తీసుకున్నా.

Samayam Telugu 25 Oct 2018, 11:50 am
భారత్‌తో విశాఖపట్నం వేదికగా బుధవారం రాత్రి ముగిసిన రెండో వన్డేలో వెస్టిండీస్ విజయానికి ఆఖరి బంతికి 5 పరుగులు అవసరంకాగా.. ఉమేశ్ యాదవ్ విసిరిన బంతిని షై హోప్ (123 నాటౌట్: 134 బంతుల్లో 10x4, 3x6) పాయింట్ దిశగా బౌండరీకి తరలించాడు. సమీపంలో ఫీల్డింగ్ చేస్తున్న అంబటి రాయుడు.. ఆ బంతిని బౌండరీకి వెళ్లకుండా నిలువరించేందుకు డైవ్ చేసినా ఫలితం లేకపోయింది. దీంతో.. మ్యాచ్ టైగా ముగిసింది. అయితే.. ఉమేశ్ యాదవ్ చివరి బంతిని యార్కర్ రూపంలో విసరబోతున్నట్లు తాను ముందుగానే ఊహించానని షై హోప్ వెల్లడించాడు.
Samayam Telugu i knew umesh yadav would bowl a wide yorker shai hope
ఉమేశ్ ఆఖరి బంతిని ఊహించా..! :హోప్


మ్యాచ్‌లో విరాట్ కోహ్లి (157 నాటౌట్: 129 బంతుల్లో 13x4, 4x6) అజేయ శతకం బాదడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో షై హోప్ సెంచరీ సాధించడంతో.. వెస్టిండీస్ కూడా సరిగ్గా 50 ఓవర్లలో 321/7తో నిలిచింది.

‘ఆఖరి బంతిని ఉమేశ్ యాదవ్ ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా యార్కర్ రూపంలో విసురుతాడని నేను ముందుగానే ఊహించా. దీంతో.. ఆ బంతిని హిట్ చేసేందుకు.. బ్యాటింగ్ పొజిషన్ కూడా తీసుకున్నా. కానీ.. నేను ఆశించినట్లుగా హిట్ చేయలేకపోయా. అయినప్పటికీ.. బంతి బౌండరీకి వెళ్లి.. మ్యాచ్ టైగా ముగిసింది. అది చాలు’ అని షై హోప్ వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.