యాప్నగరం

నా జీవితంలో ఇలాంటి రోజు వస్తుందనుకోలేదు: కోహ్లి

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మీడియాతో మాట్లాడుతూ.. నా జీవితంలో ఇలాంటి రోజు అసలు వస్తుందని అనుకోలేదన్నాడు.

TNN 12 Jan 2017, 3:56 pm
భారత క్రికెట్ జట్టుకు మూడు ఫార్మాట్లలో నాయకత్వం వహించే అదృష్టం నాకు దక్కుతుందని ఎప్పుడూ అనుకోలేదని విరాట్ కోహ్లి మీడియా చెప్పాడు. నా జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదన్నాడు. నేను జట్టులోకి అడుగుపెట్టినప్పుడు బాగా ఆడటం మీదే దృష్టి పెట్టాను. అవకాశాలు పొందడం మీద, స్థిరంగా రాణించడం మీద ఫోకస్ చేయడంతోపాటు జట్టు విజయాలు సాధించేందుకు నా వంతు కృషి చేయాలనుకున్నా అని కోహ్లి తెలిపాడు. ఇంత త్వరగా పూర్థిస్థాయి కెప్టెన్‌గా అవుతానని ఊహించలేదన్నాడు. ఇప్పటి వరకూ టెస్టుల్లో మాత్రమే భారత జట్టును ముందుకు నడిపించిన కోహ్లి.. ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్ కోసం ధోనీ స్థానంలో కెప్టెన్‌గా నియమితుడైన సంగతి తెలిసిందే.
Samayam Telugu i never thought this day is going to come to my life virat
నా జీవితంలో ఇలాంటి రోజు వస్తుందనుకోలేదు: కోహ్లి


ప్రతిదీ ఆ దేవుడు ఇచ్చాడనే భావిస్తానని కోహ్లి తెలిపాడు. అండర్ 19 కెప్టెన్‌గా జట్టుకు వరల్డ్ కప్ అందించిన కోహ్లి.. నాయకత్వం వహించే సమయంలో ప్రశంసలు, విమర్శలు వస్తుంటాయన్నాడు. కెప్టెన్సీని హాట్ సీట్‌తో పోల్చాడు.

బాధ్యత వల్ల మరింత ఉత్తమ ఆటగాడిగా, ఉత్తమ వ్యక్తిగా మరే వీలుంది. జీవితానుభవం ద్వారా నేను ఈ విషయం తెలుసుకున్నా అని చెప్పిన విరాట్.. కెప్టెన్సీని ఓ అవకాశంగా తీసుకుంటానన్నాడు.

కెప్టెన్‌గా ఒత్తిడి విషయమై ప్రశ్నించగా.. ఒత్తిడి ఉండదని నేను చెప్పను కానీ నా బలాలు, బలహీనతలేంటో నాకు తెలుసని కోహ్లి బదులిచ్చాడు. వరల్డ్ కప్‌లో భారత్‌కు నేతృత్వం వహించే విషయమై ప్రశ్నించగా అప్పటి వరకూ నేను కెప్టెన్‌గా కొనసాగి వరల్డ్ కప్‌లోనూ జట్టుకు నాయకత్వం వహిస్తే అదో గొప్ప గౌరవంగా భావిస్తానని కోహ్లి చెప్పాడు.

నీ ఆట పట్ల నమ్మకం ఉంచు, నీ సన్నద్ధతపై నమ్మకం ఉంచు, వేరే ఎవరినో అనుసరించకు అని సచిన్ టెండుల్కర్ ఇచ్చిన సలహాను ఎప్పటికీ మర్చిపోలేనని విరాట్ తెలిపాడు. అప్పటి నుంచి నేను చాలా స్వేచ్ఛగా ఆడుతున్నానని చెప్పాడు.

ఇటీవల ముంబైలో ఇంగ్లండ్‌పై చేసిన డబుల్ సెంచరీ, టీ20 వరల్డ్ కంప్ సందర్భంగా మొహాలీలో ఆసీస్‌పై ఆడిన ఇన్నింగ్స్‌ను మర్చిపోలేనని, అవి చాలా అద్భుత క్షణాలని కోహ్లి తెలిపాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.