యాప్నగరం

టెస్ట్ చాంపియన్‌షిప్, వన్డే లీగ్‌కు ఐసీసీ ఓకే

టెస్ట్ చాంపియన్‌షిప్, వన్డే ఇంటర్నేషనల్ లీగ్‌కు ఐసీసీ ఆమోదం తెలిపింది. శుక్రవారం ఆక్లాండ్‌లో గవర్నింగ్ బాడీ మీటింగ్ అనంతరం ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఈ విషయాన్ని ప్రకటించారు.

TNN 13 Oct 2017, 4:00 pm
టెస్ట్ చాంపియన్‌షిప్, వన్డే ఇంటర్నేషనల్ లీగ్‌కు ఐసీసీ ఆమోదం తెలిపింది. శుక్రవారం ఆక్లాండ్‌లో గవర్నింగ్ బాడీ మీటింగ్ అనంతరం ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఈ విషయాన్ని ప్రకటించారు. టెస్టు చాంపియన్‌షిప్‌లో టాప్-9 జట్లు పోటీపడతాయి. ఒక్కో జట్టు సొంత గడ్డ మీద మూడు, విదేశాల్లో మూడు మ్యాచ్‌ల చొప్పున ఆడనుంది. ఈ చాంపియన్‌షిప్ వల్ల ద్వైపాక్షిక సిరీస్‌లు పెరుగుతాయని ఐసీసీ భావిస్తోంది. వచ్చే ప్రపంచ కప్ తర్వాతే టెస్ట్ చాంపియన్‌షిప్‌ను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా జట్లు కనీసం రెండు టెస్టులు ఆడాల్సి ఉంటుంది. దీన్ని ఐదు టెస్టులకు పొడిగించే వీలుంది. టెస్టు చాంపియన్‌షిప్‌లో జింబాబ్వే, అప్ఘానిస్థాన్, ఐర్లాండ్ దేశాలకు చోటు దక్కలేదు.
Samayam Telugu icc approves test championship odi league
టెస్ట్ చాంపియన్‌షిప్, వన్డే లీగ్‌కు ఐసీసీ ఓకే


వన్డే ఇంటర్నేషనల్ లీగ్‌ను 2020లో నిర్వహించనున్నారు. ఇందులో 13 జట్లు పాల్గొనున్నాయి. 12 పూర్తిస్థాయి సభ్య దేశాలతోపాటు ఐసీసీ వరల్డ్ క్రికెట్ లీగ్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన జట్టు పోటీపడనున్నాయి. వరల్డ్ కప్ కోసం నేరుగా క్వాలిఫై కావడం కోసం జట్లు ఈ లీగ్‌లోతలపడతాయి. తొలి దశలో ఒక్కో జట్టు సొంత గడ్డ మీద నాలుగు, విదేశాల్లో మరో నాలుగు సిరీస్‌లు ఆడనుంది. ఒక్కో సిరీస్‌లో గరిష్టంగా మూడు వన్డేలు ఉంటాయి. తర్వాతి దశలో లీగ్‌లో పాల్గొనే జట్లన్నీ ఒకదానితో మరొకటి పోటీ పడతాయి. నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌ను ప్రయోగాత్మకంగా నిర్వహించేందుకు కూడా ఐసీసీ ఆమోదం తెలిపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.