యాప్నగరం

టీమిండియాకి సందేశం పంపిన సచిన్

టీమిండియా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని నేను బలంగా కోరుకుంటున్నాను. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌పై

TNN 16 May 2017, 5:12 pm
ఇంగ్లాండ్‌లో జరగనున్న ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ భారత్ జట్టుకి ఉత్తేజాన్ని ఇచ్చే సందేశం పంపాడు. జూన్ 1 నుంచి ఆరంభంకానున్న ఈ టోర్నీలో భారత్ తన తొలి మ్యాచ్‌లోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఢీకొనబోతోంది. ఇప్పటి వరకు ప్రపంచకప్‌లో భారత్ ఒక్కసారి కూడా పాకిస్థాన్ చేతిలో ఓడలేదు. కానీ.. మినీ ప్రపంచకప్‌గా అందరూ పిలుచుకునే ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం రెండు సార్లు ఓటమి చవిచూసింది. ముఖ్యంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా 2004లో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో భారత్‌పై పాక్ గెలిచింది. జూన్ 4న ఈ వేదికపైనే భారత్- పాకిస్థాన్ మరోసారి తలపడనున్నాయి.
Samayam Telugu icc champions trophy 2017 sachin tendulkars vital message for indian cricket team
టీమిండియాకి సందేశం పంపిన సచిన్


‘మనకు చాలా బలమైన జట్టు ఉంది. నైపుణ్యమున్న క్రికెటర్లతో ప్రస్తుతం సమతూకంగా కనిపిస్తోంది. విరాట్ కోహ్లి కెప్టెన్సీలోని ఈ జట్టు భారతీయుల కలల్ని నిజం చేస్తుంది. టీమిండియా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని నేను బలంగా కోరుకుంటున్నాను. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌పై ఎక్కువ అంచనాలు, ఆశలు ఉన్నాయి. ఇలాంటివి జట్టుకి అవసరం కూడా. ఎందుకంటే అవే క్రికెటర్లలో ప్రేరణ నింపుతాయి. మీరు ప్రతిభావంతులు కాబట్టే మీపై దేశం అంచనాలను పెంచుకుంటోంది’ అని సచిన్ వివరించాడు. ఐసీసీతో ఆదాయ పంపిణీ విషయంలో నెలకొన్న విభేదాలతో తొలుత ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ బహిష్కరించాలని యోచించినా.. సచిన్ తెందుల్కర్ ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.