యాప్నగరం

ఛాంపియన్స్ ట్రోఫీ కోసం.. 5,00,000

డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత్ తలపడే అన్ని మ్యాచ్‌ల టికెట్లకి విపరీతమైన డిమాండ్

TNN 11 May 2017, 8:59 pm
ఇంగ్లాండ్‌లో జూన్ 1 నుంచి జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ కోసం అభిమానులు అమితాసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ టోర్నీలోని ఎనిమిది మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లను ఐసీసీ అందుబాటులో ఉంచగా.. హాట్‌కేక్‌లా అమ్ముడుపోయాయి. గత వారంలోనే 15వేలకు పైగా టికెట్లను అభిమానులు కొనుగోలు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. గత సెప్టెంబరు నుంచి ఈ టోర్నీ కోసం టికెట్లు కోరుతూ 60 దేశాల నుంచి దాదాపు 5 లక్షలకు పైగా అప్లికేషన్స్ రావడం విశేషం. అయితే స్థానిక అభిమానుల కోసం జూన్ 6న ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న మ్యాచ్‌కి సంబంధించి కొన్ని టికెట్లు మాత్రమే మిగిలి ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు.
Samayam Telugu icc champions trophy 2017 tickets sold out for eight matches
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం.. 5,00,000


డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత్ తలపడే అన్ని మ్యాచ్‌ల టికెట్లకి విపరీతమైన డిమాండ్ ఉందట. ముఖ్యంగా జూన్ 4న జరిగే భారత్- పాకిస్థాన్ మ్యాచ్‌‌కి సంబంధించి అన్ని తరగతుల టికెట్లు నిమిషాల వ్యవధిలోనే అమ్ముడుపోయినట్లు నిర్వాహకులు తెలిపారు. ‘ఛాంపియన్స్ ట్రోఫీకి అభిమానుల నుంచి స్పందన చాలా బాగుంది. ఇంకా కొన్ని మ్యాచ్‌ల టికెట్లు అందుబాటులో ఉన్నాయి. అధికారిక వెబ్‌సైట్స్ ద్వారానే టికెట్లు కొనుగోలు చేయండి’ అని టోర్నమెంట్ డైరెక్టర్ స్టీవ్ ఎల్వోర్తి సూచించారు. వన్డే ర్యాంకింగ్స్‌లో సెప్టెంబరు 30, 2015నాటికి టాప్ -8లో ఉన్న జట్లు మాత్రమే ఈ టోర్నీలో తలపడుతున్నాయి. మొత్తం 15 మ్యాచ్‌లు జరగనుండగా.. ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్‌ల టికెట్లు అమ్ముడుపోయాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.