యాప్నగరం

World Largest స్టేడియం ఫస్ట్ లుక్.. అదుర్స్

నిర్మాణంలో ఉన్న ప్రపంచంలోకెల్లా అతిపెద్ద స్టేడియం ఫొటోను తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) విడుదల చేసింది. లక్షా పదివేలమంది ఒకేసారి కూర్చుని చూడగల సామర్థ్యమున్న ఈ స్టేడియం ప్రస్తుతం గుజరాత్‌లో నిర్మాణంలో ఉంది.

Samayam Telugu 18 Jan 2020, 9:03 pm
ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఫస్ట్‌లుక్‌ను తాజాగా ఐసీసీ ఆవిష్కరించింది. ఒకేసారి లక్ష పదివేలమంది కూర్చుని చూసే ఈ స్టేడియం మనదేశంలోనే నిర్మితమవుతుండటం విశేషం. రెండేళ్ల కిందట నిర్మాణం ప్రారంభమైన ఈ స్టేడియం ఈ ఏడాది అందుబాటులో వచ్చే అవకాశముంది. ఇంతకీ ఈ స్టేడియం ఎక్కడుందో తెలుసా.. మనదేశంలోనే. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో..
Samayam Telugu icc reveals first look of under construction motera stadium at ahmedabad
World Largest స్టేడియం ఫస్ట్ లుక్.. అదుర్స్


అహ్మదాబాద్‌లోని ఎంతో చరిత్ర కలిగిన మోతెరా స్టేడియాన్ని కూల్చి తాజాగా నూతన స్టేడియాన్ని నిర్మిస్తున్నారు. ఈ స్టేడియం అందుబాటులోకి వస్తే ప్రపంచలోకెల్లా అతిపెద్ద స్టేడియం రికార్డు మనవశమవుతుంది. ప్రస్తుతం ఈ రికార్డు ఆస్ట్రేలియాలోని ప్రఖ్యాత మెల్‌బోర్న్ స్టేడియం పేరిట ఉంది. అక్కడ ఒకేసారి కూర్చుని లక్ష మందికిపైగా మ్యాచ్ వీక్షించే అవకాశముంది.

Read Also : IND vs AUS 3rd ODI: ఈ రికార్డులతో కంగారూల్లో వణుకు
నిజానికి ఈ స్టేడియాన్ని ఈ ఏడాది మార్చిలో ఆసియా వర్సెస్ వరల్డ్ లెవన్ జట్ల మధ్య నిర్వహించే మ్యాచ్ ద్వారా ప్రారంభిద్దామని అనుకున్నారు. ప్రస్తుతం ఇది ప్రతిపాదన దశలో ఉంది. త్వరలోనే దీనిపై స్ఫష్టత వచ్చే అవకాశముంది. అయితే తాజాగా ఐసీసీ నిర్మాణంలో ఉన్న స్టేడియం ఫొటోను షేర్ చేసింది. ఇది సోషల్ మీడియాలో వైరలైంది.

Read Also : Ausతో మూడోవన్డేకు భారత తుది జట్టు.. కారణలివే!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.