యాప్నగరం

మహిళా క్రికెటర్లకి రైల్వేస్‌లో పదోన్నతి..!

ప్రపంచకప్‌‌లో మొత్తం 15 మంది క్రికెటర్లు భారత్‌ జట్టుకి ప్రాతినిథ్యం వహిస్తుండగా.. అందులో 10 మంది రైల్వే ఉద్యోగులుగా

TNN 23 Jul 2017, 4:53 pm
ఇంగ్లాండ్‌లో జరుగుతున్న ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్న భారత్ జట్టు‌‌‌‌కి రైల్వే మంత్రి సురేశ్ ప్రభు శుభాకాంక్షలు తెలిపారు. లార్డ్స్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో ఆదివారం ఫైనల్లో భారత్ తలపడుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఫైనల్లో జట్టు విజయం సాధించాలని ఆకాంక్షించిన మంత్రి.. భారత్ జట్టులోని 10 మంది రైల్వే ఉద్యోగులకి పదోన్నతి కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Samayam Telugu icc womens world cup 2017 final railways minister announces out of turn promotions for cricketers in india squad
మహిళా క్రికెటర్లకి రైల్వేస్‌లో పదోన్నతి..!


ఈ ప్రపంచకప్‌‌లో మొత్తం 15 మంది క్రికెటర్లు భారత్‌ జట్టుకి ప్రాతినిథ్యం వహిస్తుండగా.. అందులో 10 మంది రైల్వే ఉద్యోగులుగా ఉన్నారు. దీంతో కెప్టెన్ మిథాలీ రాజ్‌తో పాటు వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, ఏక్తా బిష్ఠ్, పూనమ్ రౌత్, వేద, పూనమ్ యాదవ్, సుష్మ, మోనా, రాజేశ్వరి గైక్వాడ్, పర్వీన్ తదితరులకి పదోన్నతి లభించింది. టోర్నీ ముగిసిన అనంతరం వారి స్థాయిని బట్టి రైల్వేస్‌ తరఫున క్యాష్ రివార్డు కూడా అందజేయనున్నట్లు రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు ప్రతినిధి ప్రకటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.