యాప్నగరం

భారత క్రికెట్‌‌కి అవి చీకటి రోజులు: సచిన్

భారత క్రికెట్‌ ప్రపంచకప్-2007 సమయంలో దాదాపు పతనావస్థకి చేరుకుందని.. ఒక విధంగా చెప్పాలంటే

TNN 12 Sep 2017, 4:27 pm
భారత క్రికెట్‌ ప్రపంచకప్-2007 సమయంలో దాదాపు పతనావస్థకి చేరుకుందని.. ఒక విధంగా చెప్పాలంటే అవి జట్టుకి చీకటి రోజులని క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ అభిప్రాయపడ్డారు. వెస్టిండీస్ ఆతిథ్యమిచ్చిన ఆ మెగా టోర్నీలో రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీలోని భారత్ జట్టు గ్రూప్ దశలోనే బంగ్లాదేశ్, శ్రీలంక చేతిలో ఓడిపోయి ఇంటిబాట పట్టింది. ఆ జట్టులో సభ్యుడైన సచిన్ తెందుల్కర్ తాజాగా ఆ రోజుల్ని గుర్తు చేసుకున్నారు.
Samayam Telugu icc world cup 2007 darkest moment for indian cricket
భారత క్రికెట్‌‌కి అవి చీకటి రోజులు: సచిన్


‘2006-2007‌లో భారత్ జట్టు ప్రదర్శన దాదాపు పతనావస్థకి చేరుకుంది. ముఖ్యంగా ప్రపంచకప్ 2007లో కనీసం గ్రూప్ దశ కూడా దాటలేకపోయాం. కానీ.. అక్కడ నుంచి భారత్‌కి తిరిగొచ్చిన తర్వాత.. తప్పిదాలను దిద్దుకుని కొత్త మార్గంలో ప్రయాణించాం. నూతన లక్ష్యాలను నిర్దేశించుకుని.. వాటిని సాధించేందుకు సమష్టిగా నిబద్ధతతో కృషి చేశాం. జట్టులో కూడా కొన్ని కఠినమైన మార్పులు చేశాం. అప్పట్లో అవి కరెక్టో కాదో తెలియదు. కానీ.. ఫలితాల కోసం ఎదురుచూశాం. ఒక విధంగా చెప్పాలంటే ఆ మార్పుల ఫలితమే.. నా కెరీర్‌లో 21 ఏళ్ల తర్వాత 2011‌లో ప్రపంచకప్‌‌ని అందుకోగలిగానేమో’ అని సచిన్ వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.