యాప్నగరం

సగం బౌలింగ్ చేసినా చాలు: కుల్దీప్

ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌కి తన చైనామన్ బౌలింగ్‌తో కొరకరాని కొయ్యగా మారిపోయాడు భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. రాంచీలో

TNN 9 Oct 2017, 7:11 pm
ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌కి తన చైనామన్ బౌలింగ్‌తో కొరకరాని కొయ్యగా మారిపోయాడు భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. రాంచీలో గత శనివారం ముగిసిన తొలి టీ20 మ్యాచ్‌లో రెండు వికెట్లు పడగొట్టిన కుల్దీప్.. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌’గా నిలిచాడు. రాంచీలో విధ్వంసకంగా హిట్టింగ్ చేసిన అరోన్ ఫించ్.. కుల్దీప్ విసిరిన బంతికి తన బుర్ర పనిచేయలేదని అందుకే క్లీన్‌ బౌల్డయినట్లు స్వయంగా కితాబిచ్చాడు. స్పిన్ బౌలింగ్‌లో తనని ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్‌వార్న్‌తో పోల్చడంపై కుల్దీప్ సోమవారం స్పందించాడు. గువహటి వేదికగా మంగళవారం రెండో టీ20 మ్యాచ్ జరగనుంది.
Samayam Telugu if i bowl half of what shane warne bowled my life will be successful kuldeep yadav
సగం బౌలింగ్ చేసినా చాలు: కుల్దీప్


‘షేన్‌వార్న్‌ బౌలింగ్‌ని నేను చిన్నతనం నుంచి గమనిస్తున్నాను. అతను బంతితో చూపిన ఆధిపత్యంలో నేను సగం చూపినా చాలు.. నా కెరీర్‌ సాఫీగా సాగిపోతుంది. అతను మణికట్టు తిప్పే విధానం, బ్యాట్స్‌మెన్‌ని బోల్తా కొట్టించే స్టైల్ చాలా ప్రత్యేకం’ అని కుల్దీప్ వివరించాడు. ఇటీవల షేన్‌వార్న్ సైతం కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌ని ప్రశంసించాడు. కుల్దీప్ ఇదే విధంగా ఓపికతో మూడు ఫార్మాట్లలో బౌలింగ్‌ని కొనసాగించగలిగితే.. అతి త్వరలోనే అతను బెస్ట్‌ లెగ్‌ స్పిన్నర్ అవుతాడని షేన్‌వార్న్ అభిప్రాయపడ్డాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.