యాప్నగరం

ఆస్ట్రేలియాపై తొలి వన్డేలో భారత్ 255‌కే ఆలౌట్

భారీ అంచనాల నడుమ ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో బరిలోకి దిగిన టీమిండియాకి తొలి మ్యాచ్‌లోనే ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ల దెబ్బకి భారత్ 255 పరుగులకే కుప్పకూలిపోయింది.

Samayam Telugu 14 Jan 2020, 5:30 pm
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌ని భారత్ పేలవంగా ఆరంభించింది. వాంఖడే వేదికగా మంగళవారం జరుగుతున్న తొలి వన్డేలో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా.. 49.1 ఓవర్లలో 255 పరుగులకే ఆలౌటైంది. జట్టులో ఓపెనర్ శిఖర్ ధావన్ (74: 91 బంతుల్లో 9x4, 1x6) హాఫ్ సెంచరీతో సత్తాచాటగా.. కేఎల్ రాహుల్ (47: 61 బంతుల్లో 4x4) చెప్పుకోదగిన ఇన్నింగ్స్ ఆడాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు పడగొట్టగా.. పాట్ కమిన్స్, కేన్ రిచర్డ్‌సన్ తలో రెండు, జంపా, అగర్ చెరొక వికెట్ తీశారు.
Samayam Telugu Mumbai: Australian bowler Pat Cummins celebrates the wicket of Indian batsman Sh...


undefined


మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో.. రోహిత్ శర్మ(10)తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన శిఖర్ ధావన్ దూకుడుగా ఆడాడు. కానీ.. ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లోనే రోహిత్ శర్మ ఔటైపోగా అనంతరం వచ్చిన కేఎల్ రాహుల్ గేర్ మార్చలేకపోయాడు. దీంతో.. భారత్ ఏ దశలోనూ భారీ స్కోరు చేసేలా కనిపించలేదు. రాహుల్ ఔటైన తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ (16), శ్రేయాస్ అయ్యర్ (4) కూడా తేలిపోవడంతో కనీసం 200 పరుగులైనా చేస్తుందా..? అనే సందేహాలు నెలకొన్నాయి.

Read More: తొలి వన్డేలో శిఖర్ ధావన్‌కి 3 లైఫ్స్.. 74 ఔట్


కానీ.. రిషబ్ పంత్ (28: 33 బంతుల్లో 2x4, 1x6), రవీంద్ర జడేజా (25: 32 బంతుల్లో 2x4, 1x6) జోడీ టీమిండియా పరువు నిలిపే ఇన్నింగ్స్ ఆడింది. ఆరో వికెట్‌కి 49 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జోడీ భారత్ శిబిరంలో ఉత్సాహం నింపగా.. ఆఖర్లో శార్ధూల్ ఠాకూర్ (13), మహ్మద్ షమీ (10), కుల్దీప్ యాదవ్ (17) ఫర్వాలేదనిపించారు.

Read More: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.