యాప్నగరం

ఆసీస్‌కు గాయం దెబ్బ.. తొలి టీ20కి కీలక ఆటగాడు దూరం!?

భారత్‌తో టీ20 సిరీస్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే వార్నర్ గాయం బారిన పడగా.. మిచెల్ స్టార్క్ సైతం తొలి టీ20 ఆడటం అనుమానంగా మారింది.

Samayam Telugu 3 Dec 2020, 12:46 pm
భారత్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు మరో గాయం దెబ్బ తగిలింది. పక్కటెముకల గాయం కారణంగా మూడో వన్డేకు దూరమైన పేసర్ మిచెల్ స్టార్క్.. మొదటి టీ20 మ్యాచ్ ఆడటం అనుమానంగా మారింది. తొలి రెండు వన్డేల్లో ఇబ్బంది పడిన స్టార్క్.. గాయం కారణంగా మూడో వన్డే ఆడలేదు. ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన డేవిడ్ వార్నర్.. చివరి వన్డేకు దూరమైన సంగతి తెలిసిందే.
Samayam Telugu mitchel-starc-finch


స్టార్క్ వెన్నెముక, పక్కటెముకల గాయంతో బాధపడుతున్నాడని చివరి వన్డే టాస్ సమయంలో ఆసీస్ కెప్టెన్ ఫించ్ తెలిపాడు. అతడికి కొద్ది రోజుల విశ్రాంతి అవసరమని మెడికల్ స్టాఫ్ తెలిపారు. సిడ్నీలో జరిగిన తొలి రెండు వన్డేల్లో స్టార్క్ 147 పరుగులిచ్చి కేవలం ఒకే వికెట్ పడగొట్టాడు.

వన్డే సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-1తో కైవసం చేసుకోగా.. మూడు టీ20ల సిరీస్ శుక్రవారం ప్రారంభం కానుంది. అనంతరం అడిలైడ్ వేదికగా 4 టెస్టుల సిరీస్ ప్రారంభం అవుతుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.