యాప్నగరం

సిడ్నీ టెస్టులో తొలిరోజు భారత్‌దే ఆధిపత్యం..!

ఒక ఎండ్‌లో వికెట్లు పడుతున్నా.. మొక్కవోని దీక్షతో బ్యాటింగ్‌ని కొనసాగించిన చతేశ్వర్ పుజారా 199 బంతుల్లోనే శతకం మైలురాయిని అందుకున్నాడు. టెస్టు కెరీర్‌లో పుజారాకి ఇది 18వ శతకంకాగా.. ఈ సిరీస్‌లోనే మూడోది.

Samayam Telugu 3 Jan 2019, 2:04 pm
ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో భారత్ జట్టు తొలిరోజే పూర్తి స్థాయిలో ఆధిపత్యం చెలాయించింది. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారా (130 బ్యాటింగ్: 250 బంతుల్లో 16x4) అజేయ శతకం బాదడంతో గురువారం ఆట ముగిసే సమయానికి భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 303/4తో తిరుగులేని స్థితిలో నిలిచింది. ప్రస్తుతం క్రీజులో పుజారాతో పాటు తెలుగు క్రికెటర్ హనుమ విహారి (39 బ్యాటింగ్: 58 బంతుల్లో 5x4) ఉన్నాడు. ఈ సిరీస్‌లో పుజారాకి ఇది మూడో శతకంకాగా.. అతను సెంచరీలు సాధించిన సిడ్నీ, మెల్‌బోర్న్ టెస్టులో భారత్ జట్టు ఘన విజయాల్ని అందుకున్న విషయం తెలిసిందే.
Samayam Telugu Indias Cheteshwar Pujara celebrates scoring his century on day one of the fourth test match between Australia and India at the SCG in Sydney


మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రోహిత్ శర్మ స్థానంలో మళ్లీ తుది జట్టులోకి వచ్చిన ఓపెనర్ కేఎల్ రాహుల్ (9: 6 బంతుల్లో 2x4) మరోసారి వైఫల్యాల బాట కొనసాగించగా.. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (77: 112 బంతుల్లో 7x4, 2x6) వరుసగా రెండో అర్ధశతకాన్ని నమోదు చేశాడు. దాదాపు 32 ఓవర్ల పాటు ఆస్ట్రేలియా‌కి రెండో వికెట్ ఇవ్వకుండా అడ్డుపడిన మయాంక్- పుజారా జోడీ 116 పరుగుల భాగస్వామ్యంతో టీమిండియాకి శుభారంభమిచ్చింది. అయితే.. జట్టు స్కోరు 126 వద్ద సిక్స్ కొట్టే ప్రయత్నంలో మయాంక్ ఔటవగా.. అనంతరం వచ్చిన విరాట్ కోహ్లి (23: 59 బంతుల్లో 4x), అజింక్య రహానె (18: 55 బంతుల్లో 1x4) నిరాశపరిచారు.

ఒక ఎండ్‌లో వికెట్లు పడుతున్నా.. మొక్కవోని దీక్షతో బ్యాటింగ్‌ని కొనసాగించిన చతేశ్వర్ పుజారా
199 బంతుల్లోనే శతకం మైలురాయిని అందుకున్నాడు. టెస్టు కెరీర్‌లో పుజారాకి ఇది 18వ శతకంకాగా.. ఈ సిరీస్‌లోనే మూడోది కావడం అతని ఫామ్‌కి నిదర్శనం. అంతేకాకుండా.. ఆస్ట్రేలియా గడ్డపై ఒక టెస్టు సిరీస్‌లోనే 1,000 బంతులు ఎదుర్కొన్న ఐదో భారత్ క్రికెటర్‌గానూ ఈ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ ఘనత అందుకున్నాడు. ఇప్పటి వరకూ విజయ్ హజారే, సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీ మాత్రమే ఈ రికార్డులో ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.