యాప్నగరం

Sydney ODI: ఫీల్డింగ్ చేస్తూనే.. బుట్టబొమ్మ పాటకు స్టెప్పులేసిన వార్నర్.. వీడియో వైరల్

Allu Arjun నటించిన అలవైకుంఠపురం సినిమాలోని బుట్టబొమ్మ సాంగ్ అంటే వార్నర్‌కు ఎంతో ఇష్టమనే సంగతి తెలిసిందే. ఈ పాటకు ఇదివరకే భార్యతో కలిసి డ్యాన్స్ చేసిన వార్నర్.. సిడ్నీ వన్డేలో ఫీల్డింగ్ చేస్తూనే స్టెప్పులేశాడు.

Samayam Telugu 27 Nov 2020, 9:09 pm
భారత్‌తో జరిగిన తొలి వన్డేలో హాఫ్ సెంచరీతో సత్తా చాటిన వార్నర్.. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ‘బుట్టబొమ్మ’ పాటకు స్టెప్పులేశాడు. బౌండరీ లైన్ దగ్గర నిలబడి ఫీల్డింగ్ చేస్తున్న వార్నర్.. సరదాగా పాటను హమ్ చేస్తూ.. బుట్ట బొమ్మ స్టెప్పేయడాన్ని చాలా మంది తమ ఫోన్ కెమెరాల్లో బంధించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బుట్టబొమ్మ పాటకు వార్నర్ స్టెప్పులేయడం పట్ల సన్‌రైజర్స్ స్పందించింది. ప్లేస్ మారిందంతే.. బుట్టబొమ్మ మీద ప్రేమ మారలేదని ట్వీట్ చేసింది.
Samayam Telugu warner | Image: fox sports


ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న డేవిడ్ వార్నర్.. తెలుగు పాటల పట్ల ఇష్టం పెంచుకున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ సమయంలో తన భార్య క్యాండీస్‌తో కలిసి వార్నర్ బుట్ట బొమ్మ పాటకు స్టెప్పులేసి టిక్ టాక్‌లో పోస్టు చేయగా.. ఆ వీడియో వైరల్ అయ్యింది. మైండ్ బ్లాక్, రాములో రాములా లాంటి పాటలకు సైతం వార్నర్ తన ఫ్యామిలీతో కలిసి స్టెప్పులేశాడు. ఐపీఎల్ 2020 టైటిల్ గెలిస్తే.. బుట్ట బొమ్మ పాటకు మరోసారి డ్యాన్స్ చేస్తానని వార్నర్ తెలిపాడు.

అలవైకుంఠపురంలోని బుట్టబొమ్మను అమితంగా ఇష్టపడే వార్నర్.. ఆ పాటకు రికార్డ్ స్థాయిలో యూట్యూబ్‌లో 450 మిలియన్ల వ్యూస్ రాగా వెల్‌డన్ అల్లు అర్జున్ అని వార్నర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ఈ మధ్యే అరవింద సమేతలో ఎన్టీఆర్‌లా కత్తి పట్టిన మార్ఫింగ్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.