యాప్నగరం

పుజారాకి తన బలమేంటో తెలుసు..! : మయాంక్

నాన్‌స్ట్రైక్ ఎండ్‌ నుంచి చతేశ్వర్ పుజారా బ్యాటింగ్‌‌ని చూడటం చాలా గొప్ప అనుభూతి. అతనికి తన బలంపై స్పష్టమైన అవగాహన ఉంది. ఎక్కడా ఏకాగ్రత కోల్పోకుండా చక్కగా ఇన్నింగ్స్‌ని నిర్మించాడు. -మయాంక్ అగర్వాల్

Samayam Telugu 3 Jan 2019, 3:43 pm
భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారాకి తన బలంపై స్పష్టమైన అవగాహన ఉందని ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కితాబిచ్చాడు. ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా గురువారం ఆరంభమైన నాలుగో టెస్టు మ్యాచ్‌లో చతేశ్వర్ పుజారా (130 బ్యాటింగ్: 250 బంతుల్లో 16x4) అజేయ శతకం బాదడంతో ఈరోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 303/4తో మెరుగైన స్థితిలో నిలిచింది.
Samayam Telugu 600


ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లోనే కేఎల్ రాహుల్ (9: 6 బంతుల్లో 2x4) ఔటవగా.. అనంతరం క్రీజులోకి వచ్చిన పుజారా.. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (77: 112 బంతుల్లో 7x4, 2x6)తో కలిసి రెండో వికెట్‌కి 116 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీ దాదాపు 32 ఓవర్ల పాటు ఆస్ట్రేలియా‌కి వికెట్ ఇవ్వలేదు. ఈరోజు ఆట ముగిసిన తర్వాత పుజారా ‘శతక’ ఇన్నింగ్స్ గురించి మయాంక్ అగర్వాల్ మాట్లాడాడు.

‘నాన్‌స్ట్రైక్ ఎండ్‌ నుంచి చతేశ్వర్ పుజారా బ్యాటింగ్‌‌ని చూడటం చాలా గొప్ప అనుభూతి. అతనికి తన బలంపై స్పష్టమైన అవగాహన ఉంది. ఎక్కడా ఏకాగ్రత కోల్పోకుండా చక్కగా ఇన్నింగ్స్‌ని నిర్మించాడు. పుజారా డిఫెన్స్ దుర్భేద్యం. గతి తప్పిన బంతుల కోసం ఎదురుచూసిన అతను.. అదును చూసి ఆస్ట్రేలియా బౌలింగ్‌పై ఎదురుదాడికి దిగాడు’ అని మయాంక్ అగర్వాల్ వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.