ఇంగ్లాండ్‌తో అహ్మదాబాద్ వేదికగా గురువారం ప్రారంభమైన నాలుగో టెస్టులో మొదటి రోజు భారత్ జట్టు ఆధిపత్యం చెలాయించింది. మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ టీమ్ 205 పరుగులకే ఆలౌటవగా.. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన భారత్ జట్టు ఈరోజు ఆట ముగిసే సమయానికి 24/1తో నిలిచింది. క్రీజులో ఓపెనర్ రోహిత్ శర్మ (8 బ్యాటింగ్: 34 బంతుల్లో 1x4), చతేశ్వర్ పుజారా (15 బ్యాటింగ్: 36 బంతుల్లో 1x4) ఉన్నారు. భారత్ జట్టు ఇంకా 181 పరుగులు తొలి ఇన్నింగ్స్‌లో వెనకబడి ఉంది. ఇంగ్లాండ్‌ని 205 పరుగులకే కుప్పకూల్చిన ఆనందంలో ఈరోజు చివరి సెషన్లో మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. యువ ఓపెనర్ శుభమన్ గిల్ (0: 3 బంతుల్లో) తొలి ఓవర్లనే అండర్సన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔటైపోయాడు. అనంతరం వచ్చిన పుజారా ఆచితూచి ఆడగా.. రోహిత్ శర్మ మాత్రం పూర్తిగా ఆత్మరక్షణలో బ్యాటింగ్ చేశాడు.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జోరూట్ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కానీ.. ఓపెనర్లు డొమినిక్ సిబ్లీ (2), జాక్ కార్లీ (9)లను ఆరంభంలోనే ఔట్ చేసిన అక్షర్ పటేల్.. ఆ జట్టుని ఒత్తిడిలోకి నెట్టేశాడు. అనంతరం వచ్చిన జానీ బెయిర్‌స్టో (28), కెప్టెన్ జో రూట్ (5)లను మహ్మద్ సిరాజ్ ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేసేశాడు. అయితే.. ఒక ఎండ్‌లో క్రీజులో నిలిచిన బెన్‌స్టోక్స్ (55: 126 బంతుల్లో 6x4, 2x6).. ఓలీ పోప్ (29: 87 బంతుల్లో 2x4)తో కలిసి ఇంగ్లాండ్ టీమ్‌ని ఆదుకునే ప్రయత్నం చేశాడు. కానీ.. స్టోక్స్‌ని వాషింగ్టన్ సుందర్ ఔట్ చేయగా.. ఆ తర్వాత బెన్‌ఫోక్స్ (1), డొమినిక్ బెస్ (3), జాక్ లీచ్ (7), జేమ్స్ అండర్స్ (10 నాటౌట్) తక్కువ స్కోరుకే పరిమితమయ్యారు. డేనియల్ లారెన్స్ (46: 74 బంతుల్లో 8x4) మాత్రం ఫర్వాలేదనిపించాడు. స్పిన్నర్లు అక్షర్ పటేల్ (4/68), అశ్విన్ (3/47) మరోసారి సత్తాచాటగా.. సిరాజ్‌కి రెండు, వాషింగ్టన్ సుందర్‌కి ఒక వికెట్ దక్కింది.