యాప్నగరం

భారత సెలక్టర్లు పెద్ద తప్పిదం చేశారు: వెంగ్‌సర్కార్

తొలి రెండు టెస్టుల్లో విఫలమైన ఓపెనర్ మురళీ విజయ్‌పై వేటు వేసిన సెలక్టర్లు.. అతని స్థానంలో చివరి రెండు టెస్టుల కోసం పృధ్వీ షా‌‌కి అవకాశం కల్పించారు. కానీ.. ?

Samayam Telugu 5 Sep 2018, 5:49 pm
ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కి జట్టుని ఎంపిక చేసే సమయంలో రోహిత్ శర్మను పక్కనపెట్టి భారత సెలక్టర్లు పెద్ద తప్పిదం చేశారని మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్ అభిప్రాయపడ్డారు. తొలి రెండు టెస్టుల్లో విఫలమైన ఓపెనర్ మురళీ విజయ్‌పై వేటు వేసిన సెలక్టర్లు.. అతని స్థానంలో చివరి రెండు టెస్టుల కోసం పృధ్వీ షా‌‌కి అవకాశం కల్పించారు. కానీ.. యువ ఓపెనర్‌ పృధ్వీ షా‌‌కి కాకుండా.. రోహిత్ శర్మకి ఆ ఛాన్సి ఇచ్చి ఉంటే బాగుండేదని వెంగ్‌సర్కార్ అభిప్రాయపడ్డారు. అనాలోచితంగా సెలక్టర్లు జట్టుని ఎంపిక చేయడంతోనే నాలుగో టెస్టులో భారత్ జట్టు ఓడి సిరీస్‌ను 1-3తో చేజార్చుకుందని ఆయన విమర్శించారు.
Samayam Telugu rohitsharmafbl


‘టెస్టు సిరీస్‌ కోసం రోహిత్ శర్మని జట్టులోకి తీసుకోకుండా భారత సెలక్టర్లు పెద్ద తప్పిదం చేశారు. టెస్టుల్లో అతనికి మంచి రికార్డులు లేకపోవచ్చు. కానీ.. మ్యాచ్ పరిస్థితులకి అనుగుణంగా రోహిత్ శర్మ ఆడగలడు. అయితే.. అతడ్ని పక్కన పెట్టడం ద్వారా సెలక్టర్లు అనాలోచితంగా జట్టుని ఎంపిక చేసినట్లు అర్థమవుతోంది. ఇంగ్లాండ్ పిచ్‌లపై ఎవరు మెరుగ్గా రాణించగలరు..? అని అంచనా వేయడంలో విఫలమయ్యారు. అలానే.. ప్రత్యామ్నాయ ఆటగాళ్లపైనా దృష్టి సారించలేకపోయారు’ అని దిలీప్ వెంగ్‌సర్కార్ విమర్శించారు.

భారత్, ఇంగ్లాండ్‌ మధ్య సిరీస్‌లో చివరిదైన ఐదో టెస్టు మ్యాచ్ శుక్రవారం నుంచి ఓవల్ వేదికగా జరగనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.