యాప్నగరం

టీమ్ నిర్ణయాన్ని పంత్ అంగీకరించాలి: రహానె

భారత వన్డే, టీ20, టెస్టు జట్టులోకి రిషబ్ పంత్ ఎంపికవుతున్నాడు. కానీ.. ఒక్క మ్యాచ్‌లో కూడా అతనికి తుది జట్టులో టీమిండియా మేనేజ్‌మెంట్ అవకాశమివ్వడం లేదు. టెస్టుల్లో సాహా, వన్డే, టీ20ల్లో రాహుల్‌కి ఛాన్సిస్తున్నారు.

Samayam Telugu 20 Feb 2020, 5:32 pm
భారత యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇటీవల మైదానంలో కంటే రిజర్వ్ బెంచ్‌పైనే ఎక్కువగా కనిపిస్తున్నాడు. గత ఏడాది వన్డే ప్రపంచకప్ తర్వాత టీమిండియాకి ధోనీ దూరమవగా.. భారత సెలక్టర్లు రిషబ్ పంత్‌కి వరుసగా అవకాశాలిచ్చారు. దీంతో.. ఒకానొక దశలో మూడు ఫార్మాట్లలోనూ రిషబ్ పంత్ ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్‌గా కనిపించాడు. కానీ.. మూడు నెలల వ్యవధిలోనే సీన్ రివర్స్ అయ్యింది. ఇప్పుడు మూడు ఫార్మాట్లకీ అతను ఎంపికవుతున్నా.. తుది జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోతున్నాడు.
Samayam Telugu Rishabh Pant T20


Read More: CSK ఫస్ట్ ఛాయిస్ సెహ్వాగ్.. కానీ ధోనికి ఛాన్స్

‘రిజర్వ్ బెంచ్‌పై కూర్చోవడం ఎవరికీ ఇష్టం ఉండదు. కానీ.. టీమ్ నిర్ణయాన్ని సదరు క్రికెటర్ అర్థం చేసుకోవాలి.. అంగీకరించాలి కూడా. తప్పదు.. మళ్లీ టీమ్‌లోకి రావాలంటే శ్రమించాలి.. నిరూపించుకోవాలి. ఇందులో సీనియర్, జూనియర్ అని భేదం ఏమీ ఉండదు’ అని రహానె సూచించాడు. వన్డే, టీ20లకి పూర్తిగా దూరమైపోయిన అజింక్య రహానె టెస్టుల్లో మాత్రం నిలకడగా రాణిస్తున్నాడు. భారత్, న్యూజిలాండ్ మధ్య శుక్రవారం నుంచి తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుంది.

Read More: తొలిటెస్టు వేదిక‌తో ర‌విశాస్త్రికి ప్ర‌త్యేక అనుబంధం
ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో గాయం కారణంగా రిషబ్ పంత్ మ్యాచ్ నుంచి అర్ధాంతరంగా తప్పుకోగా.. కేఎల్ రాహుల్‌కి కీపింగ్ బాధ్యతలు అప్పగించారు. ఆ మ్యాచ్‌లో కీపర్‌గా ధోనీ తరహాలో స్టంపౌట్ చేసిన రాహుల్.. ఆ తర్వాత కూడా కీపర్/ బ్యాట్స్‌మెన్‌గా సత్తాచాటాడు. దీంతో.. రిషబ్ పంత్‌ని పూర్తిగా పక్కన పెట్టేసిన టీమిండియా మేనేజ్‌మెంట్ రాహుల్‌కి వరుస అవకాశాలిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.