యాప్నగరం

భారత్ ఓపెనర్లకి అనుభవం లేదు.. కానీ..?: సౌథీ

భారత్ జట్టు సీనియర్ ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ లేకుండానే కివీస్‌తో టెస్టు సిరీస్‌లో తలపడబోతోంది. ఓపెనర్లుగా పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్‌ టీమిండియా ఇన్నింగ్స్‌ని ఆరంభించనున్నారు.

Samayam Telugu 19 Feb 2020, 6:20 pm
భారత ఓపెనర్లు పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్‌కి పెద్దగా అనుభవం లేదు.. కానీ ఇద్దరూ మంచి క్లాస్ ఆటగాళ్లని న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ కొనియాడాడు. కివీస్‌తో శుక్రవారం నుంచి టీమిండియా రెండు టెస్టుల సిరీస్‌లో తలపడనుంది. ఈ నేపథ్యంలో.. ఈరోజు మీడియాతో మాట్లాడిన టిమ్ సౌథీ.. భారత్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌ బలంగా ఉందని చెప్పుకొచ్చాడు. గాయం కారణంగా రోహిత్ శర్మ టెస్టులకి దూరమమయ్యాడు.
Samayam Telugu Prithvi Shaw ,Mayank Agarwal


‘గాయాల కారణంగా ఇద్దరు ఆటగాళ్లు టీమిండియాకి దూరమయ్యారు. అయినప్పటికీ.. ప్రస్తుతం ఆ జట్టులో మంచి టాలెంట్ ఉన్న క్రికెటర్లున్నారు. టీమ్‌కి అవసరమైన సమయంలో బాధ్యత తీసుకునేందుకు వారు సిద్ధంగా ఉంటారు. ఇక ఓపెనర్లు పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్‌లకి అంతర్జాతీయ క్రికెట్‌లో పెద్దగా అనుభవం లేదు. కానీ.. ఇద్దరూ మంచి క్లాస్ ప్లేయర్స్’ అని సౌథీ వెల్లడించాడు.

2018లో టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన పృథ్వీ షా ఇప్పటి వరకూ రెండు టెస్టులు మాత్రమే ఆడగా.. మయాంక్ అగర్వాల్ 9 టెస్టులు ఆడాడు. దీంతో.. ఈ ఇద్దరు ఓపెనర్లు కివీస్‌పై టెస్టు సిరీస్‌లో ఎలా ఆడతారో..? అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇటీవల న్యూజిలాండ్‌తో ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లో పృథ్వీ షా, అగర్వాల్ ఓపెనింగ్ జోడి ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.