యాప్నగరం

Kapil Dev సూచనకి విలువిచ్చిన కెప్టెన్ కోహ్లీ

గంటకి 140-150 కి.మీ వేగంతో బంతులు సంధించగల పేసర్ నవదీప్ సైనీ.. భారత్‌కి ఆశాకిరణంలా కనిపిస్తున్నాడు. దీంతో.. అతనికి అవకాశాలివ్వాలని కపిల్‌దేవ్ సూచిస్తున్నాడు.

Samayam Telugu 8 Feb 2020, 8:39 am
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ సాధారణంగా తుది జట్టు మార్పుపై ఎవరి సూచనల్ని పట్టించుకోడు. ఎవరు ఎన్ని విమర్శించినా సరే..? మొండిగా ముందుకు వెళ్లిపోతుంటాడు. కానీ.. దిగ్గజ క్రికెటర్ కపిల్‌దేవ్ తాజాగా చేసిన ఓ సూచనకి కోహ్లీ విలువిచ్చినట్లు కనిపించింది. న్యూజిలాండ్‌తో గత బుధవారం జరిగిన తొలి వన్డేలో భారత్ జట్టు ఓడిన తర్వాత.. రెండో వన్డే కోసం తుది జట్టులోకి ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీని తీసుకోవాలని కపిల్‌దేవ్ సూచించాడు. దీంతో.. రెండో వన్డే‌లో అనూహ్యంగా సైనీకి అవకాశం దక్కింది.
Samayam Telugu Saini, Virat Kohli



‘తొలి వన్డేలో వికెట్ టేకింగ్ బౌలర్ లేని లోటు స్పష్టంగా కనబడింది. అందుకే.. రెండో వన్డేకి నవదీప్ సైనీని తుది జట్టులోకి తీసుకుంటే మంచిది. మంచి పేస్, వికెట్ టేకింగ్ సామర్థ్యం ఉన్న సైనీ.. తుది జట్టులో చోటుకి అర్హుడు. బుమ్రా బౌలింగ్‌లో ఆచితూచి ఆడుతున్న న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌లు.. మిగతా బౌలర్లపై ఎదురుదాడికి ప్రయత్నిస్తారు. అలాంటి సమయంలో సైనీ లాంటి బౌలర్లు వికెట్లు పడగొట్టగలుగుతారు’ అని కపిల్‌దేవ్ అభిప్రాయపడ్డాడు.

Read More: బుమ్రాతో అంత ఈజీ కాదు.. కానీ..?: గప్తిల్

ఆక్లాండ్ వేదికగా శనివారం జరుగుతున్న రెండో వన్డేకి భారత్ తుది జట్టులో విరాట్ కోహ్లీ రెండు మార్పులు చేశాడు. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి రెస్ట్‌ ఇచ్చి యువ పేసర్ నవదీప్ సైనీకి అవకాశమిచ్చిన కోహ్లీ.. తొలి వన్డేలో తేలిపోయిన కుల్దీప్ యాదవ్‌పై వేటు వేసి చాహల్‌ని తీసుకున్నాడు. ఈ వన్డే సిరీస్‌ తర్వాత రెండు టెస్టు సిరీస్ జరగనుండటంతో షమీకి రెస్ట్ ఇచ్చినట్లు టాస్ సమయంలో కోహ్లీ వెల్లడించాడు.

Read More: తొలి వన్డేలో కుల్దీప్ ఫెయిల్యూర్‌కి కారణమిదే

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.