యాప్నగరం

Ranchi T20లో టీమిండియా టార్గెట్ 154.. చివర్లో తేలిపోయిన కివీస్

ఫస్ట్ ఓవర్ నుంచే మార్టిన్ గప్తిల్ దూకుడుగా ఆడేయగా.. చివర్లో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌లు భారీ షాట్లు ఆడటంలో విఫలమయ్యారు. దాంతో.. 153 పరుగులతోనే కివీస్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

Samayam Telugu 19 Nov 2021, 9:21 pm

ప్రధానాంశాలు:

  • రెండో టీ20లో భారత్ టార్గెట్ 154
  • రెండు వికెట్లు పడగొట్టిన అరంగేట్రం బౌలర్ హర్షల్ పటేల్
  • ఫస్ట్ ఓవర్ నుంచే దూకుడుగా ఆడేసిన మార్టిన్ గప్తిల్
  • చివర్లో బ్యాట్ ఝళిపించలేకపోయిన కివీస్ ఆటగాళ్లు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu IND vs NZ 2nd T20 (Pic Credit: BCCI/Twitter)
రాంచీ వేదికగా శుక్రవారం జరుగుతున్న రెండో టీ20లో టీమిండియాకి 154 పరుగుల లక్ష్యాన్ని పర్యాటక న్యూజిలాండ్ నిర్దేశించింది. మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ టీమ్.. మార్టిన్ గప్తిల్ (31: 15 బంతుల్లో 3x4, 2x6), డార్లీ మిచెల్ (31: 28 బంతుల్లో 3x4), గ్లెన్ ఫిలిప్స్ (34: 21 బంతుల్లో 1x4, 3x6), మార్క్ ఛాప్‌మెన్ (21: 17 బంతుల్లో 3x4) ఫర్వాలేదనిపించడంతో 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. భారత బౌలర్లలో హర్షల్ పటేల్‌కి రెండు వికెట్లు, భువనేశ్వర్, దీపక్ చాహర్, అక్షర్ పటేల్, అశ్విన్‌కి తలో వికెట్ దక్కాయి.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దాంతో.. డార్లీ మిచెల్‌తో కలిసి న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన మార్టిన్ గప్తిల్.. ఫస్ట్ ఓవర్ నుంచే టాప్ గేర్‌లోకి వెళ్లిపోయాడు. ఎడాపెడా బౌండరీలు బాదిన గప్తిల్- మిచెల్ జోడీ.. తొలి వికెట్‌కి 4.2 ఓవర్లలోనే 42 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. కానీ.. గప్తిల్ ఔట్ తర్వాత కివీస్ స్కోరు బోర్డు నెమ్మదించింది. ఛాప్‌మెన్, ఫిలిప్స్ క్రీజులో నిలిచినా.. దూకుడుగా ఆడలేకపోయారు. అలానే మిడిల్ ఓవర్లలో టిమ్ సైఫర్ట్ (13: 15 బంతుల్లో 1x4), నీషమ్ (3: 12 బంతుల్లో) బ్యాట్ ఝళిపించలేకపోవడంతో.. న్యూజిలాండ్ 153 పరుగులతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆఖర్లో మిచెల్ శాంట్నర్ (8 నాటౌట్: 9 బంతుల్లో), మిల్నే (5 నాటౌట్: 4 బంతుల్లో) భారీ షాట్లు ఆడే ప్రయత్నం చేసినా.. భారత బౌలర్లు వారికి అవకాశమివ్వలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.