యాప్నగరం

Ind vs NZ: ఇర్ఫాన్ పఠాన్ 15ఏళ్ల నాటి రికార్డ్ బ్రేక్.. షమీ @100

పాకిస్థాన్‌తో 15ఏళ్ల క్రితం అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇర్ఫాన్ పఠాన్ తన 59వ వన్డేలో 100 వికెట్ల మైలురాయిని అందుకోగా.. షమీ 56వ వన్డేతోనే ఆ మార్క్‌ని చేరుకున్నాడు.

Samayam Telugu 23 Jan 2019, 11:28 am
న్యూజిలాండ్‌తో నేపియర్ వేదికగా ఈరోజు జరుగుతున్న తొలి వన్డేలో భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. మ్యాచ్ రెండో ఓవర్‌లోనే కివీస్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ (5: 9 బంతుల్లో 1x4)ని బౌల్డ్ చేసిన మహ్మద్ షమీ.. భారత్ తరఫున వేగంగా 100 వికెట్ల మైలురాయిని అందుకున్న ఫాస్ట్ బౌలర్‌గా నిలిచాడు. కెరీర్‌లో 56వ వన్డే ఆడుతున్న షమీ 5.51 ఎకానమీతో ఈ వంద వికెట్ల మైలురాయిని అందుకోగా.. 2004‌లో ఇర్ఫాన్ పఠాన్ నెలకొల్పిన రికార్డ్ బద్దలైంది..!
Samayam Telugu Dxj9jySVYAARvFA


పాకిస్థాన్‌తో 15ఏళ్ల క్రితం అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇర్ఫాన్ పఠాన్ తన 59వ వన్డేలో 100 వికెట్ల మైలురాయిని అందుకోగా.. షమీ 56వ వన్డేతోనే ఆ మార్క్‌ని చేరుకున్నాడు. ఈ జాబితాలో షమీ, పఠాన్ తర్వాత.. జహీర్ ఖాన్ 65 వన్డేల్లో, అజిత్ అగార్కర్ 67 వన్డేల్లో, జవగళ్ శ్రీనాథ్ 68 వన్డేల్లో ఈ వంద వికెట్ల మైలురాయిని అందుకున్నారు.

మహ్మద్ షమీ తక్కువ వన్డేల్లోనే ఈ మార్క్‌ని చేరుకున్నప్పటికీ.. అందరి కంటే ఎక్కువ సమయం తీసుకున్నాడు. ఇర్ఫాన్ పఠాన్, జహీర్, అగార్కర్ కేవలం రెండేళ్ల వ్యవధిలోనే ఆ మైలురాయిని అందుకోగా.. షమీ మాత్రం వన్డేల్లోకి అరంగేట్రం చేసిన ఆరేళ్ల 17 రోజులకి 100 వికెట్ల క్లబ్‌లో చేరడం విశేషం.

ఈరోజు తొలి వన్డేలో కుల్దీప్ యాదవ్ (4/39), మహ్మద్ షమీ (3/19), చాహల్ (2/43) ధాటికి టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌ జట్టు 38 ఓవర్లలోనే 157 పరుగులకే ఆలౌటైంది

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.