యాప్నగరం

భారత్‌లో క్రికెట్ మ్యాచ్‌ల్ని ఆపేయండి: పాక్

పాకిస్థాన్ కాదు ఇప్పుడు భారత్.. అంతర్జాతీయ మ్యాచ్‌‌లకి సురక్షితమైన ప్రదేశం కాదు. ఏ క్రికెట్ దేశం భారత్‌లో పర్యటించకుండా అడ్డుకోండని ఐసీసీని కోరిన పాకిస్థాన్ మాజీ క్రికెటర్

Samayam Telugu 27 Dec 2019, 5:34 pm
భారత్‌లో అంతర్జాతీయ క్రికెట్ జట్లకి రక్షణ లేదని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ జావెద్ మియాందాద్ ఆరోపించాడు. పౌరసత్వ చట్ట సవరణ బిల్లు నేపథ్యంలో గత వారం రోజులుగా దేశంలో ఉద్యమాలు జరుగుతున్న అంశాన్ని ప్రస్తావించిన మియాందాద్.. ఏ దేశ క్రికెట్ జట్టు భారత్‌కి వెళ్లకుండా అడ్డుకోవాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి సూచించాడు. భారత్, పాకిస్థాన్ జట్లు గత కొన్నేళ్లుగా కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడుతున్న విషయం తెలిసిందే.
Samayam Telugu ind vs pak not pakistan but india is not a safe country for any tourist says javed miandad
భారత్‌లో క్రికెట్ మ్యాచ్‌ల్ని ఆపేయండి: పాక్


Read More: T20 series: భారత్‌కి పాక్ ఊహించని కౌంటర్
2009లో శ్రీలంక క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు దాడిగి తెగబడగా.. అప్పటి నుంచి ఏ అంతర్జాతీయ క్రికెట్ జట్టు కూడా పాక్ గడ్డపై పర్యటించలేదు. దీంతో.. దాదాపు 10 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఇటీవల శ్రీలంక జట్టు మళ్లీ పాకిస్థాన్‌కి వెళ్లి సిరీస్ ఆడింది. కానీ.. బంగ్లాదేశ్ టీమ్‌ మాత్రం పాక్ గడ్డపై పర్యటించేందుకు తాజాగా నిరాకరిస్తోంది. దీంతో.. బంగ్లాదేశ్ నిర్ణయం వెనుక భారత్ హస్తం ఉందని అనుమానిస్తున్న పాకిస్థాన్.. ఇప్పుడు కొత్త పల్లవి అందుకుంది.

Read More:స్పిన్నర్ హిందువని అవమానిస్తారా..? భారత్, పాక్ క్రికెటర్ల మధ్య తేడా ఇదే: మదన్ లాల్

‘ఐసీసీ చొరవ తీసుకుని.. అన్ని క్రికెట్ దేశాలతోనూ భారత్‌లో భద్రతపై మాట్లాడాలి. ఆ దేశం తమ సొంత ప్రజలతోనే పోరాడుతోంది. ఇదే విషయాన్ని క్రికెట్ దేశాలతో చెప్పి.. అక్కడ ఎలాంటి సిరీస్‌లూ జరగకుండా అడ్డుకోవాలి. ఇప్పుడు భారత్ కంటే మిగిలిన దేశాల్లోనే భద్రత బాగుంది’ అని మియాందాద్ వెల్లడించాడు. జనవరి 5 నుంచి మూడు టీ20ల సిరీస్ కోసం భారత్ పర్యటనకి శ్రీలంక రానుండగా.. ఆ తర్వాత 14 నుంచి మూడు వన్డేల సిరీస్‌ కోసం ఆస్ట్రేలియా రాబోతోంది.

Read More: ధోనీ ‘కెప్టెన్సీ’ క్రేజ్.. పాకిస్థాన్ నుంచి మద్దతు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.