యాప్నగరం

ప్రాక్టీస్ మ్యాచ్‌లో రాయుడి శతకం.. యువీ, ధోనీ మెరుపులు

ముంబైలో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ పండగ చేసుకున్నారు,

TNN 10 Jan 2017, 5:11 pm
ముంబైలో భారత్-ఎ, ఇంగ్లండ్ జట్ల మధ్య జరగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్-ఎ జట్టు అదరగొట్టింది. నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 304 పరుగులు చేసింది. తెలుగు కుర్రాడు అంబటి రాయుడు సెంచరీతో రాణించగా.. 2013 డిసెంబర్ తర్వాత వన్డేల్లోకి తిరిగి అడుగుపెట్టిన యువరాజ్ సింగ్ సత్తా చాటాడు. 48 బంతులు ఆడిన యువీ 56 పరుగులు చేశాడు. ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదిన యువీ.. జే బాల్ విసిరిన షార్ట్‌పిచ్ బంతిని సరిగా ఆడటం విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో మన్‌దీప్ సింగ్, శిఖర్ ధవన్ ఓపెనింగ్ చేయగా.. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 7.3 ఓవర్లలో 25 పరుగులు జోడించారు.
Samayam Telugu 4 in 50 overs
ప్రాక్టీస్ మ్యాచ్‌లో రాయుడి శతకం.. యువీ, ధోనీ మెరుపులు


Enter MSD! CCI deafening and rise to welcome @msdhoni to the crease. pic.twitter.com/xq4mgqGeNb — BCCI (@BCCI) January 10, 2017
ఎనిమిది పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మన్‌దీప్ అవుటైనా.. శిఖర్ ధవన్ మాత్రం రాణించాడు. 84 బంతులు ఆడిన శిఖర్.. 63 రన్స్ చేశాడు. అంబటి రాయుడుతో కలిసి రెండో వికెట్‌కు 111 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన రాయుడు సరిగ్గా 100 పరుగులు చేశాక.. ధోనీకి బ్యాటింగ్ అవకాశం కల్పించే ఉద్దేశంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. చివర్లో వేగంగా ఆడిన ధోనీ అర్ధ సెంచరీతో రాణించగా.. సంజూ శాంసన్ మాత్రం డకౌట్‌గా వెనుదిరిగి నిరాశపర్చాడు. వోక్స్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో ధోనీ వీర విహారం చేశాడు. రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు సహా 23 పరుగులు రాబట్టాడు. దీంతో భారత్ స్కోరు 300 పరుగులు దాటింది. ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్ విల్లే, జేక్ బౌల్‌కు చెరో రెండు వికెట్లు దక్కాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.