యాప్నగరం

విరాట్ కోహ్లీ: మరింత సీరియస్‌గా ఆడతాం.. ఆ లోటు తీర్చుకుంటాం

కొత్త ఏడాదిలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ పలు అసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. అక్టోబర్ నుంచి టీ20 వరల్డ్‌కప్ ప్రారంభమవ్వనున్న క్రమంలో ఆటపై మరింత సీరియస్‌గా ఫోకస్ పెట్టి ఆడతామని కోహ్లీ పేర్కొన్నాడు.

Samayam Telugu 6 Jan 2020, 5:26 pm
భారత కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ పగ్గాలు చేపట్టిన తర్వాత అన్ని ఫార్మాట్లలోనూ జట్టును దుర్భేధ్యంగా మార్చాడు. అటు కెప్టెన్‌గా ఇటు ప్లేయర్‌గా రెండు పాత్రల్లోనూ ఒదిగిపోయి భారత్‌కు ఎన్నో విజయాలు సాధించాడు. అయితే చంద్రునికో మచ్చలా కోహ్లీ కెప్టెన్సీలో ఇప్పటివరకు భారత్ ఒక్క ఐసీసీ టైటిల్ నెగ్గలేదు. గతేడాది వన్డే, టెస్టుల్లో సత్తాచాటామంటున్న కోహ్లీ.. పొట్టిఫార్మాట్‌లో అంతగా రాణించలేదని తెలిపాడు.
Samayam Telugu VIRAT kohli3


Read Also : గంగూలీ చాలా తెలివైనోడు.. ఆ చెత్త పనికి ఒప్పుకోడు.. అక్తర్ ధీమా
ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ సమీపిస్తున్న వేళ ఆటను చాలా సీరియస్‌గా తీసుకుంటామని, మెగాటోర్నీకి అన్ని విధాల సిద్ధమవుతామని కోహ్లీ తెలిపాడు. ఆదివారం శ్రీలంకతో గువాహటిలో జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దయ్యిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మాట్లాడిన కోహ్లీ.. వచ్చే మెగాటోర్నీకి సంబంధించిన ప్రణాళికలను వివరించాడు.

Read Also : విరాట్ కోహ్లీ ముగ్గేస్తున్నావా..? గువాహటి టీ20లో పిచ్ పరిశీలనపై సెటైర్లు
ఇక భారత్ తరపున కోహ్లీ ఒక్క ఐసీసీ టైటిల్ సాధించలేదు. గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో సెమీస్‌కు చేరడమే కోహ్లీ కెప్టెన్సీలో అతిపెద్ధ ఘనత. మరోవైపు కోహ్లీకి ముందు సారథిగా వ్యవహరించిన ఎంఎస్ ధోనీ అత్యంత విజయవంతమైన ఇండియన్ కెప్టెన్‌గా నిలిచాడు. 2007 టీ20 వరల్డ్‌కప్, 2011 వన్డే వరల్డ్‌కప్, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఇలా మూడు మెగాటోర్నీలను సాధించిన ఏకైక భారత సారథిగా నిలిచాడు. వచ్చే అక్టోబర్ నుంచి టీ20 వరల్డ్‌కప్ ప్రారంభమవ్వనుండటంతో ఈసారి ఎలాగైనా మెగాటోర్నీని సాధించాలని కోహ్లీ ప్రణాళికలు వేస్తున్నాడు.

Read Also : ఆసీస్‌పై అంపైర్ల కొరడా .. పెనాల్టీతో హెచ్చరికలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.