యాప్నగరం

ప్రపంచకప్‌లో నేడు భారత్‌కి చావోరేవో పోరు..!

తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ భారీ స్కోర్లతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఓపెనర్ స్మృతి మంద‌నా.. చివరిగా నాలుగు మ్యాచ్‌ల్లోనూ సింగిల్

TNN 15 Jul 2017, 11:59 am
ఐసీసీ మహిళల ప్రపంచకప్‌ని వరుసగా నాలుగు విజయాలతో ఘనంగా ఆరంభించిన భారత్ జట్టు.. అనూహ్యంగా తడబడి సెమీస్ అవకాశాల్ని సంక్లిష్టం చేసుకుంది. పేలవ బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌ లోపాలతో చివరిగా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల చేతిలో ఘోర ఓటమి చవిచూసింది. దీంతో ఈ రోజు న్యూజిలాండ్‌తో జరగనున్న లీగ్ చివరి మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన సంకట స్థితి ఏర్పడింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సమీకరణాలతో సంబంధం లేకుండా భారత్ సెమీస్ చేరనుండగా.. ఓడితే ఇంటిబాట పట్టాల్సి వస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి మ్యాచ్ ప్రారంభంకానుంది.
Samayam Telugu india face new zealand in must win tie for semis spot
ప్రపంచకప్‌లో నేడు భారత్‌కి చావోరేవో పోరు..!


తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ భారీ స్కోర్లతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఓపెనర్ స్మృతి మంద‌నా.. చివరిగా నాలుగు మ్యాచ్‌ల్లోనూ సింగిల్ డిజిట్‌కే పరిమితమవడం‌తో భారత్‌పై ఒత్తిడి పెరుగుతోంది. కెప్టెన్ మిథాలీ రాజ్, మరో ఓపెనర్ పూనమ్ రౌత్ నిలకడగా ఆడుతున్నా.. వీరికి సహకరించే వారు కరవయ్యారు. టాప్ ఆర్డర్ నిలకడగా రాణించలేకపోతోంది. మరోవైపు ప్రత్యర్థి బ్యాటర్ ఎదురుదాడి చేస్తే.. మన బౌలర్లు లయ తప్పుతున్నారు. ఫీల్డింగ్‌ మొదటి నుంచి పేలవంగానే సాగుతోంది. దీంతో లీగ్ చివరి మ్యాచ్‌లో భారత్ ప్రదర్శనపై అభిమానుల్లో ఆందోళన నెలకొంది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే.. పట్టికలో మెరుగైన స్థానంలో ఉన్న భారత్ సెమీస్ చేరుతుంది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు ఇప్పటికే సెమీస్ చేరగా.. నాలుగో బెర్త్ కోసం భారత్, న్యూజిలాండ్ తలపడుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.