యాప్నగరం

టెస్టు సిరీస్‌కి భారత్‌ సరిగా సిద్ధమవ్వలేదు..!

ఇంగ్లాండ్‌ గడ్డపై జరుగుతున్న టెస్టు సిరీస్ కోసం భారత్ జట్టు సరిగా సిద్ధమవ్వలేదని ఇంగ్లాండ్ జట్టు మాజీ కెప్టెన్ నాసర్ హుస్సేన్

Samayam Telugu 8 Aug 2018, 7:54 pm
ఇంగ్లాండ్‌ గడ్డపై జరుగుతున్న టెస్టు సిరీస్ కోసం భారత్ జట్టు సరిగా సిద్ధమవ్వలేదని ఇంగ్లాండ్ జట్టు మాజీ కెప్టెన్ నాసర్ హుస్సేన్ అభిప్రాయపడ్డాడు. బర్మింగ్‌హామ్ వేదికగా గత శనివారం ముగిసిన తొలి టెస్టులో విరాట్ కోహ్లి మినహా టీమిండియా బ్యాట్స్‌మెన్స్‌ విఫలమవడంతో ఇంగ్లాండ్ జట్టు 31 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. రెండో టెస్టు మ్యాచ్‌ గురువారం నుంచి లార్డ్స్ వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన హుస్సేన్.. సిరీస్‌కి ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌‌ని మూడు రోజులకి భారత్‌ తగ్గించుకోవడాన్ని తప్పుబట్టాడు.
Samayam Telugu Djl_tmcX4AAjPeB


‘టెస్టు సిరీస్‌ కోసం భారత్ జట్టు పూర్తిగా సన్నద్ధమవ్వలేదేమో..? అని నాకు అనిపిస్తోంది. తొలి టెస్టుకి ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌ను మూడు రోజులకే భారత్ తగ్గించుకోవడం ఆశ్చర్యపరిచింది. తొలి టెస్టులో అండర్సన్, బ్రాడ్, బెన్‌స్టోక్స్, కుర్రాన్ స్వింగ్ రాబడుతుంటే.. తొలి టెస్టులో బ్యాట్స్‌మెన్‌‌లు చేతులెత్తేశారు. క్లిష్ట సమయాల్లో సహనంతో క్రీజులో నిలిచే పుజారాని తుది జట్టులోకి తీసుకోకపోవడం అక్కడ భారత్‌ని మరింత దెబ్బతీసింది. బహుశా.. రెండో టెస్టులో అతను ఆడచ్చేమో..?’ అని నాసర్ హుస్సేన్ వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.