యాప్నగరం

స్కోర్లు చూడండి.. రహానెకి ఛాన్సివ్వండి

దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు కోసం అజింక్య రహానెని తుది జట్టులోకి తీసుకోవాలని భారత మాజీ క్రికెటర్ కిరణ్ మోర్ సూచించారు.

TNN 11 Jan 2018, 1:05 pm
దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు కోసం అజింక్య రహానెని తుది జట్టులోకి తీసుకోవాలని భారత మాజీ క్రికెటర్ కిరణ్ మోర్ సూచించారు. శనివారం నుంచి సెంచూరియన్ వేదికగా రెండో టెస్టు జరగనుండగా.. గత సోమవారం ముగిసిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా 72 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. పేస్‌‌కి స్వర్గధామమైన కేప్‌టౌన్ పిచ్‌పై భారత టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. దీంతో ఆ సఫారీ పిచ్‌లపై అనుభవం ఉన్న రహానెకి తుది జట్టులో ఛాన్సిస్తే భారత్‌కి విజయావకాశాలు మెరుగవతాయని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.
Samayam Telugu india need to include ajinkya rahane kl rahul in the playing xi kiran more
స్కోర్లు చూడండి.. రహానెకి ఛాన్సివ్వండి


‘సెంచూరియన్ టెస్టులో అజింక్య రహానె, కేఎల్ రాహుల్‌కి తుది జట్టులో చోటిస్తే మేలు. ఐదుగురు లేదా ఆరుగురు బ్యాట్స్‌మెన్.. ఏ కాంబినేషన్‌తో భారత్‌ బరిలోకి దిగుతుందోననేది ఇప్పుడు ఆసక్తికరం. అయితే.. తొలి టెస్టు ఓటమి నేపథ్యంలో కచ్చితంగా బ్యాటింగ్‌ బలం పెంచుకోవడం ఇప్పుడు టీమిండియాకి అవసరం’ అని కిరణ్ వివరించారు. రహానె స్థానంలో రోహిత్‌ శర్మని తొలి టెస్టులో ఆడించగా.. అతను విఫలమయ్యాడు. 2013-14 దక్షిణాఫ్రికా పర్యటనలో రహానె ఆడిన రెండు టెస్టుల్లో 47, 15 (జొహనెస్ బర్గ్), 51 నాటౌట్, 96 (డర్బన్) సత్తా చాటాడు. అదే సిరీస్‌లో రోహిత్ శర్మ వరుసగా 14, 16... 0, 25తో ఫెయిల్ అయ్యాడు. అయినా.. తొలి టెస్టులో అతనికి అవకాశం ఇవ్వడం కోహ్లి పేలవ నిర్ణయమేనని విమర్శిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.