యాప్నగరం

ఇంగ్లాండ్ గడ్డపై భారత్ గెలుపు సాధ్యమే..!

ఇంగ్లాండ్ పర్యటన రూపంలో భారత జట్టుకి కఠిన పరీక్ష ఎదురుకానుంది. అందుకే.. సిరీస్ ఆరంభానికి ముందే అక్కడి పిచ్‌లపై అవగాహన

Samayam Telugu 24 Mar 2018, 12:18 pm
ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టు మెరుగైన ప్రదర్శన చేస్తుందని ఓపెనర్ శిఖర్ ధావన్ ధీమా వ్యక్తం చేశాడు. ఆగస్టు‌లో ఆ గడ్డపై జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌ కోసం ముందుగానే అక్కడికి భారత జట్టు వెళ్లి ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడితే సిరీస్ గెలవడం ఏమంత కష్టంకాదని ధావన్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల ముగిసిన దక్షిణాఫ్రికా పర్యటన‌‌కి ముందు భారత్ జట్టు అక్కడ ఎలాంటి ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడకపోవడంతోనే టెస్టు సిరీస్‌ని చేజార్చుకోవాల్సి వచ్చిందని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ పర్యటనలో అలాంటి విమర్శలకి అడ్డుకట్ట వేయాలని టీమిండియా యోచిస్తోంది.
Samayam Telugu ..


ప్రస్తుతం ఐపీఎల్‌ 2018 సీజన్‌ కోసం సిద్ధమవుతున్న ధావన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇంగ్లాండ్ పర్యటన రూపంలో భారత జట్టుకి కఠిన పరీక్ష ఎదురుకానుంది. అందుకే.. సిరీస్ ఆరంభానికి ముందే అక్కడి పిచ్‌లపై అవగాహన పెంచుకునేందుకు ప్రయత్నిస్తాం. ఆ గడ్డపై ప్రాక్టీస్ మెరుగ్గా సాగితే.. కచ్చితంగా సిరీస్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చగలం’ అని ధావన్ ధీమా వ్యక్తం చేశాడు. ఇంగ్లాండ్ గడ్డపై సిరీస్‌ గెలవపోవడానికి కారణం ఏంటి..? అని ప్రశ్నించగా.. ‘ఆ గడ్డపై టెస్టు సిరీస్ గెలవకపోవడానికి ప్రత్యేక కారణమంటూ ఏమీ లేదు’ అని ధావన్ వెల్లడించాడు.

జులై 3న ప్రారంభంకానున్న ఈ సుదీర్ఘ సిరీస్‌లో మొదట మూడు టీ20లు, ఆ తర్వాత మూడు వన్డేలు, చివర్లో ఐదు టెస్టులు జరగనున్నాయి. దక్షిణాఫ్రికా పర్యటనలో మూడు టెస్టుల సిరీస్‌ని 1-2తో భారత్ చేజార్చుకున్న విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.