యాప్నగరం

Ind vs Aus Odi: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో సిరీస్‌లకి భారత్ జట్టు ప్రకటన

ఆస్ట్రేలియాతో జనవరి 12 నుంచి మూడు వన్డేల సిరీస్ ఆడనున్న భారత్.. ఆ తర్వాత జనవరి 23 నుంచి న్యూజిలాండ్‌తో ఐదు వన్డేలు, మూడు టీ20ల్లో తలపడనుంది.

Samayam Telugu 24 Dec 2018, 6:01 pm
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో వచ్చే ఏడాది జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌ల కోసం 16 మందితో కూడిన భారత జట్టుని బీసీసీఐ బుధవారం ప్రకటించింది. పేలవ ఫామ్ కారణంగా టీ20 జట్టులో చోటు కోల్పోయిన మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మళ్లీ వన్డే, టీ20 జట్టులోకి ఎంపికవగా.. ఆసియా కప్‌లో గాయపడిన హార్దిక్ పాండ్యా కూడా పునరాగమనం చేయనున్నాడు. దినేశ్ కార్తీక్ వన్డే, టీ20 జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకోగా.. రిషబ్ పంత్ మాత్రం కేవలం టీ20లకే ఎంపికయ్యాడు.
Samayam Telugu indian-cricket-team-bcci-1518610865


undefined
ఆస్ట్రేలియాతో జనవరి 12 నుంచి మూడు వన్డేల సిరీస్ ఆడనున్న భారత్.. ఆ తర్వాత జనవరి 23 నుంచి న్యూజిలాండ్‌తో ఐదు వన్డేలు, మూడు టీ20ల్లో తలపడనుంది. ఈ మొత్తం సిరీస్‌లకి జట్టుని సెలక్టర్లు ఈరోజే ప్రకటించేశారు. ఇటీవల ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో మెప్పించిన కృనాల్ పాండ్య.. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కి ఎంపికయ్యాడు. అతను తన సోదరుడు హార్దిక్ పాండ్యాతో కలిసి ఆ సిరీస్‌లో ఆడే అవకాశం ఉంది.

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో తలపడే భారత్ జట్టు ఇదే..!
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్, మహేంద్రసింగ్ ధోని (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్, చాహల్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్, మహ్మద్ షమీ

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో తలపడే భారత్ జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్, మహేంద్రసింగ్ ధోని (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య, కుల్దీప్ యాదవ్, చాహల్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.