యాప్నగరం

హీరోయిన్‌తో టీమిండియా యువ ఓపెనర్ డేటింగ్..?

ఐపీఎల్ 2020 సీజన్ ముంగిట ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా పర్సనల్ విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. అతను నటి ప్రాచీ సింగ్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు ఆమె పెట్టిన కామెంట్లు ద్వారా..?

Samayam Telugu 10 Sep 2020, 1:20 pm
భారత్ జట్టు యువ ఓపెనర్ పృథ్వీ షా (20) ప్రేమలో పడినట్లు కనిపిస్తున్నాడు. ఐపీఎల్ 2020 సీజన్‌లో ఆడేందుకు యూఏఈకి వెళ్లిన ఈ ఢిల్లీ క్యాపిటల్స్ సంచలన బ్యాట్స్‌మెన్.. తాజాగా సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్‌లు పెట్టాడు. ఆ పోస్ట్‌లకి హీరోయిన్ ప్రాచీ సింగ్ కామెంట్లు పెట్టిన తీరు.. ఈ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమని వెలుగులోకి తెచ్చింది. పృథ్వీ షా స్టయిల్‌గా కళ్లద్దాలు పెట్టుకుంటున్న వీడియోకి ‘‘హ్హ హ్హ ఐ మిస్ దట్ లాఫ్’’ అని కామెంట్ పెట్టిన ప్రాచీ సింగ్.. ఆ తర్వాత పృథ్వీ షా నవ్వుతున్న ఫొటోకి ‘‘క్యూటీ’’ అంటూ లవ్ ఎమోజీని యాడ్ చేసింది. అంతేకాదు.. అతను పోస్ట్ చేస్తున్న ప్రతి ఫొటోకీ ఆమె కామెంట్లు పెడుతోంది.
Samayam Telugu Prithvi Shaw, Prachi Singh


View this post on Instagram Axar bhai... sorry, par yeh secret mein aur nahi chuppa sakta 🤣 P.S. watch the video till the end 😂@akshar.patel A post shared by PRITHVI SHAW (@prithvishaw) on Sep 7, 2020 at 5:50am PDT

ఐపీఎల్ 2018 సీజన్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున మ్యాచ్‌‌లు ఆడుతున్న పృథ్వీ షా.. ఇప్పటి వరకూ 25 మ్యాచ్‌లాడి 141.04 స్ట్రైక్‌రేట్‌తో ఏకంగా 598 పరుగులు చేశాడు. ఇందులో 4 హాఫ్ సెంచరీలు ఉండగా.. అత్యధిక స్కోరు 99 కావడం విశేషం. సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు జరగనుండగా.. ఓపెనర్ శిఖర్ ధావన్‌తో కలిసి ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌ని పృథ్వీ షా ఆరంభించనున్నాడు.

View this post on Instagram Back to the base camp with the bossman @rickyponting, time to get the bats into action.🏏 A post shared by PRITHVI SHAW (@prithvishaw) on Sep 2, 2020 at 6:31am PDT

వాస్తవానికి భారత క్రికెటర్లు, సినిమా హీరోయిన్స్ మధ్య ప్రేమాయణం సుదీర్ఘకాలంగా నడుస్తున్న చర్చే. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. బాలీవుడ్ నటి అనుష్క శర్మని ప్రేమించి పెళ్లి చేసుకోగా.. వీరికి వచ్చే ఏడాది జనవరిలో బిడ్డ కూడా పుట్టబోతున్నారు. ఇక ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య, నటి నటాషా‌ జోడీకి ఇటీవల పండంటి మగబిడ్డ జన్మించిన విషయం తెలిసిందే. ఓపెనర్ కేఎల్ రాహుల్ కూడా బాలీవుడ్ నటి అతియా శెట్టితో గత ఏడాదికాలంగా ప్రేమాయణం నడిపిస్తున్నాడు. తాజాగా పృథ్వీ షా కూడా ఆ జాబితాలో చేరిపోయాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.