యాప్నగరం

సఫారీలపై ఐదో వన్డేలో భారత్ గెలిస్తే..?

దక్షిణాఫ్రికా పర్యటనలో వరుసగా నాలుగు విజయాలు (ఒక టెస్టు, మూడు వన్డేలు) తర్వాత

TNN 20 Feb 2018, 9:30 pm
దక్షిణాఫ్రికా పర్యటనలో వరుసగా నాలుగు విజయాలు (ఒక టెస్టు, మూడు వన్డేలు) తర్వాత ఓటమి చవిచూసిన భారత్ జట్టు దిద్దుబాటు చర్యలకు దిగింది. గత శనివారం రాత్రి ముగిసిన నాలుగో వన్డేని వర్షం కారణంగా అంపైర్లు కుదించగా.. దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. దీంతో ఆరు వన్డేల సిరీస్‌లో ప్రస్తుతం భారత్ 3-1తో ఆధిక్యంలో నిలవగా.. ఐదో వన్డే మంగళవారం సాయంత్రం 4.30 నుంచి పోర్ట్‌ ఎలిజబెత్ వేదికగా జరగనుంది. ఈ వన్డేలో టీమిండియా గెలిస్తే.. సఫారీ గడ్డపై రెండు చెత్త రికార్డుల్ని చెరిపేసినట్లవుతుంది.
Samayam Telugu india renew pursuit of history against south africa
సఫారీలపై ఐదో వన్డేలో భారత్ గెలిస్తే..?


దక్షిణాఫ్రికాలో ఇప్పటి వరకు ఒక ద్వైపాక్షిక సిరీస్‌ని కూడా భారత్ జట్టు గెలవలేదు. దీంతో.. ఐదో వన్డేలో కోహ్లిసేన గెలిస్తే.. అది సరికొత్త చరిత్రకి నాంది కానుంది. అయితే.. పోర్ట్ ఎలిజబెత్‌ స్టేడియంలో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ భారత్ ఇప్పటి వరకు ఓడిపోయింది. కాబట్టి.. ఈ చెత్తరికార్డుని చెరిపేయాలంటే.. టీమిండియా అత్యుత్తమంగా ఆడాల్సిందే. ముఖ్యంగా నాలుగో వన్డేలో చేసిన బౌలింగ్, ఫీల్డింగ్ తప్పిదాల్ని దిద్దుకోవాల్సి ఉంది. మరోవైపు నాలుగో వన్డే గెలుపుతో సఫారీలు ఉత్సాహంగా బరిలోకి దిగుతున్నారు. దీంతో.. ఐదో వన్డేపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.