యాప్నగరం

టీ20 జట్టులో నెహ్రాకి చోటు.. రహానె ఔట్

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ కోసం భారత సెలక్టర్లు జట్టుని ఆదివారం అర్ధరాత్రి ప్రకటించారు.

TNN 2 Oct 2017, 8:51 am
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ కోసం భారత సెలక్టర్లు జట్టుని ఆదివారం అర్ధరాత్రి ప్రకటించారు. ఆదివారం ముగిసిన ఐదు వన్డేల సిరీస్‌లో అద్భుతంగా రాణించిన ఓపెనర్ అజింక్య రహానెపై వేటు పడగా.. దాదాపు ఎనిమిది నెలల నుంచి టీమిండియాకి దూరంగా ఉంటున్న సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రాకి ఆశ్చర్యకరంగా చోటు లభించింది. తన భార్యకి అనారోగ్యం కారణంగా వన్డే సిరీస్‌కి దూరమైన ఓపెనర్ శిఖర్ ధావన్‌‌కి ఈ సిరీస్‌లో సెలక్టర్లు అవకాశం కల్పించారు.
Samayam Telugu india team announced for t20i series against australia
టీ20 జట్టులో నెహ్రాకి చోటు.. రహానె ఔట్


ఐదు వన్డేల సిరీస్‌లో ఒక వన్డే మాత్రమే ఆడి.. పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన పేస్ బౌలర్లు ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీలపై వేటు పడింది. వెస్టిండీస్‌ పర్యటన అనంతరం వరుసగా శ్రీలంక, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లకి దూరమైన దినేశ్ కార్తీక్‌‌కి సెలక్టర్లు ఈ టీ20 సిరీస్‌లో అవకాశమిచ్చారు. సీనియర్ ఆటగాళ్లు యువరాజ్ సింగ్, సురేశ్ రైనాలతో పాటు యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌పై మరోసారి సెలక్టర్లు మొండిచేయి చూపారు. మూడు టీ20ల సిరీస్‌ ఈ నెల 7న రాంచీ టీ20తో ఆరంభంకానుంది.

భారత టీ20 జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, మనీశ్ పాండే, కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, ధోని (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్, చాహల్, జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, ఆశిష్ నెహ్రా, అక్షర్ పటేల్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.