యాప్నగరం

తండ్రిగా ధోనీ, రోహిత్ బాటలోనే కోహ్లీ..? ఛలో ఆస్ట్రేలియా

2017లో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలకి వివాహం జరగగా.. వచ్చే ఏడాది జవనరి నాటికి తాము ముగ్గురం కాబోతున్నట్లు ఈ విరుష్క జోడీ సంతోషంగా ప్రకటించింది. కానీ.. అనుష్క శర్మ డెలివరీ టైమ్‌లో విరాట్ కోహ్లీ..?

Samayam Telugu 29 Aug 2020, 9:27 am
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ తన భార్య సాక్షి ప్రసవించిన సమయంలో ఆస్ట్రేలియా టూర్‌లో ఉన్నాడు. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ కూడా అంతే.. తన భార్య రితిక బిడ్డకి జన్మనిచ్చిన టైమ్‌లో ఆస్ట్రేలియా గడ్డపై మ్యాచ్‌లు ఆడుతున్నాడు. ఇప్పుడు కెప్టెన్ విరాట్ కోహ్లీ వంతు..! వచ్చే ఏడాది జనవరిలో తన భార్య అనుష్క శర్మ ఓ బిడ్డకి జన్మనివ్వబోతున్నట్లు గత గురువారం విరాట్ కోహ్లీ ప్రకటించాడు. మరి ఆ టైమ్‌లో విరాట్ కోహ్లీ ఎక్కడ ఉండబోతున్నాడో తెలుసా..?
Samayam Telugu MS Dhoni, Virat Kohli



ఐపీఎల్ 2020 సీజన్‌లో ఆడేందుకు ప్రస్తుతం యూఏఈకి వెళ్లిన విరాట్ కోహ్లీ.. ఆరు రోజుల క్వారంటైన్‌ని పూర్తి చేసుకుని శుక్రవారం నుంచి ప్రాక్టీస్ సెషన్‌ని కూడా మొదలెట్టేశాడు. సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు జరగనుండగా.. ఆ టోర్నీ ముగిసిన తర్వాత యూఏఈ నుంచి డైరెక్ట్‌గా ఆస్ట్రేలియా టూర్‌కి టీమిండియా వెళ్లనుంది.


డిసెంబరు 3 నుంచి ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్ ఆడాల్సి ఉండగా.. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అక్కడికి చేరుకున్న తర్వాత టీమిండియా ఆటగాళ్లు 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాలి. దాంతో.. ఐపీఎల్ ముగిసిన తర్వాత మళ్లీ భారత్‌కి వచ్చి.. వెళ్లడం కష్టమని ఇప్పటికే తేల్చి చెప్పేసిన బీసీసీఐ.. ఈ మేరకు ఆటగాళ్లకి కూడా సమాచారం అందించింది. ఆస్ట్రేలియా టూర్‌కి తాను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండనున్నట్లు ఇప్పటికే కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేసినట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

Read More: undefined

డిసెంబరు 3 నుంచి జనవరి 7 వరకూ భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టుల సిరీస్ జరగనుండగా.. ఆ తర్వాత జనవరి 12 నుంచి 17 వరకూ మూడు వన్డేల్లో ఈ రెండు జట్లు ఢీకొనబోతున్నాయి. వాస్తవానికి గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఈ ఆస్ట్రేలియా టూర్‌లో అక్టోబరు 11 నుంచి 17 వరకూ మూడు టీ20లని కూడా భారత్ ఆడాల్సి ఉంది. కానీ.. టీ20 వరల్డ్‌కప్ వాయిదా, ఆ విండోలోనే ఐపీఎల్ 2020 సీజన్ జరుగుతుండటంతో ఈ టీ20 సిరీస్‌ వాయిదాపడింది. కానీ.. జనవరి 17 తర్వాత ఆ మూడు టీ20లని కూడా తమతో ఆడాలని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఇప్పటికే బీసీసీఐకి ప్రతిపాదనలు పంపింది. ఒకవేళ ఆ సిరీస్‌ కూడా ఆడితే.. విరాట్ కోహ్లీ జనవరి ఆఖర్లోగానీ మళ్లీ భారత్ గడ్డపై అడుగుపెట్టే అవకాశం లేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.