యాప్నగరం

ఆసీస్‌పై శిఖర్ ధావన్ మెరుపు అర్ధశతకం

174 పరుగుల లక్ష్య ఛేదనకి భారత్ జట్టు శిఖర్ ధావన్ (51: 28 బంతుల్లో 8x4, 1x6) హాఫ్ సెంచరీ బాదడంతో 7.3 ఓవర్లు ముగిసే సమయానికి 70/1తో మెరుగైన స్థితిలో కొనసాగుతోంది.

Samayam Telugu 21 Nov 2018, 4:37 pm
ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ వేదికగా ఈరోజు జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ మెరుపు అర్ధశతకం బాదేశాడు. వర్షం కారణంగా 17 ఓవర్లకి కుదించిన మ్యాచ్‌లో 174 పరుగుల లక్ష్య ఛేదనకి భారత్ జట్టు శిఖర్ ధావన్ (51: 28 బంతుల్లో 8x4, 1x6) హాఫ్ సెంచరీ బాదడంతో 7.3 ఓవర్లు ముగిసే సమయానికి 70/1తో మెరుగైన స్థితిలో కొనసాగుతోంది. ధావన్‌కి టీ20 కెరీర్‌లో ఇది 9వ అర్ధశతకం. ఓపెనర్ రోహిత్ శర్మ (7) తక్కువ స్కోరుకే ఔటయ్యాడు.
Samayam Telugu Dubai: Indias Shikhar Dhawan raises his bat to celebrate scoring a century duri...
India's Shikhar Dhawan raises his bat to celebrate scoring a century during the one day international cricket match of Asia Cup between India and Pakistan in Dubai, United Arab Emirates. AP/PTI


అంతకముందు భారత్ జట్టుకి డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 174 పరుగుల లక్ష్యాన్ని ఆతిథ్య ఆస్ట్రేలియానిర్దేశించింది. వర్షం కారణంగా 17 ఓవర్లకి కుదించిన ఈ మ్యాచ్‌లో హిట్టర్ గ్లెన్ మాక్స్‌వెల్ (46: 24 బంతుల్లో 4x6), స్టాయినిస్ (33 నాటౌట్: 19 బంతుల్లో 3x4, 1x6), క్రిస్‌లిన్ (37: 20 బంతుల్లో 1x4, 4x6) దూకుడుగా ఆడటంతో ఆస్ట్రేలియా 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. కానీ.. 16.1 ఓవర్లకి ఆసీస్ 153/3తో నిలిచిన దశలో వర్షం రావడంతో గంట సేపు మ్యాచ్ సమయం వృథా అయ్యింది. ఆ తర్వాత 17 ఓవర్లకి మ్యాచ్‌ని కుదించిన అంపైర్లు.. ఆసీస్‌కి ఐదు బంతులు ఆడే అవకాశం ఇచ్చి డ/లూ పద్ధతిలో భారత్‌కి ఈ టార్గెట్‌ని నిర్దేశించారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు, జస్‌ప్రీత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.