యాప్నగరం

తొలివన్డే‌ నుంచి ఆస్ట్రేలియా హిట్టర్ ఔట్..?

భారత్‌తో ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరగనున్న తొలి వన్డేకి ఆస్ట్రేలియా హిట్టర్ అరోన్ ఫించ్ దూరం

TNN 14 Sep 2017, 6:56 pm
భారత్‌తో ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరగనున్న తొలి వన్డేకి ఆస్ట్రేలియా హిట్టర్ అరోన్ ఫించ్ దూరం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. రెండు రోజుల క్రితం తొలి వన్డేకి ఆతిథ్యమివ్వనున్న చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తూ.. అరోన్ ఫించ్ గాయపడ్డాడు. అతని చీలమండలానికి గాయమవడంతో అప్పటి నుంచి ఈ హిట్టర్ ప్రాక్టీస్ సెషన్‌కి దూరంగా ఉంటున్నాడు.
Samayam Telugu india vs australia 2017 aaron finch aggravates calf injury ahead of first odi
తొలివన్డే‌ నుంచి ఆస్ట్రేలియా హిట్టర్ ఔట్..?


తొలి వన్డే సమయానికి అరోన్ ఫించ్ ఫిటెనెస్ సాధించలేకపోతే.. అతని స్థానంలో యువ బ్యాట్స్‌మెన్‌ ట్రావిస్‌ హెడ్‌కి అవకాశం దక్కనుంది. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తనకి జట్టులో స్థానం కచ్చితంగా దక్కుతుందని ట్రావిస్ హెడ్ ధీమా వ్యక్తం చేశాడు. ‘చెపాక్ వన్డేలో నాకు చోటు ఖాయంగా కనిపిస్తోంది. నాకిష్టమైన నాలుగో స్థానంలో నేను బ్యాటింగ్ చేయబోతున్నా’ అంటూ ట్రావిస్ వెల్లడించాడు. ఆస్ట్రేలియా తాత్కాలిక కోచ్ డేవిడ్ సైతం.. అరోన్ ఫించ్‌ ఆడకపోతే.. అతని స్థానంలో ట్రావిస్‌ని ఆడిస్తామని స్పష్టం చేశాడు. తన భార్యకి అనారోగ్యంగా ఉండటంతో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ సైతం.. తొలి మూడు వన్డేలకి దూరమవుతున్నట్లు బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.