యాప్నగరం

Virat Kohli నమ్మకాన్ని నిలబెట్టిన హనుమ విహారి..!

పెర్త్ పిచ్ ఎక్కువగా పేస్, బౌన్స్‌కి అనుకూలిస్తుండటంతో.. నలుగురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగాలనుకున్న టీమిండియా.. ఒక స్పిన్ ఆల్‌రౌండర్‌‌ని కూడా టీమ్‌లో చేర్చాలనుకుంది. కానీ..?

Samayam Telugu 14 Dec 2018, 12:58 pm
Samayam Telugu Hanuma Vihari,Virat Kohli
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో తెలుగు క్రికెటర్ హనుమ విహారి కెప్టెన్ విరాట్ కోహ్లీ నమ్మకాన్ని నిలబెట్టాడు. ఈరోజు ఆరంభమైన ఈ టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ హారిస్ (70: 141 బంతుల్లో 10x4) వికెట్ తీసేందుకు నలుగురు ఫాస్ట్ బౌలర్లు నాలుగు గంటలు పాటు తీవ్రంగా ఇబ్బంది పడిన వేళ.. తానేసిన రెండో ఓవర్‌లోనే హనుమ విహారి అలవోకగా ఆ వికెట్ పడగొట్టాడు. అడిలైడ్ టెస్టులో రోహిత్ శర్మ గాయపడటంతో.. అతని స్థానంలో హనుమ విహారి జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే.

పెర్త్ పిచ్ ఎక్కువగా పేస్, బౌన్స్‌కి అనుకూలిస్తుండటంతో.. నలుగురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగాలనుకున్న టీమిండియా.. ఒక స్పిన్ ఆల్‌రౌండర్‌‌ని కూడా టీమ్‌లో చేర్చాలనుకుంది. ఈ క్రమంలో సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా నుంచి పోటీ ఏర్పడినా.. హనుమ విహారీపై నమ్మకంతో కోహ్లీ తుది జట్టులో చోటిచ్చాడు. ఇంగ్లాండ్‌తో గత ఆగస్టులో ఆడిన తొలి టెస్టులోనే అర్ధశతకం బాదిన హనుమ విహారి, మూడు వికెట్లు కూడా తీశాడు.

ఈరోజు ఇన్నింగ్స్ 49వ ఓవర్ వేసిన హనుమ విహారి బౌలింగ్‌లో బంతిని ప్లిక్ చేసేందుకు హారిస్ ప్రయత్నించాడు. కానీ.. ఎడ్జ్ తాకిన బంతి.. స్లిప్‌లో గాల్లోకి లేవగా.. ఫీల్డర్ అజింక్య రహానె సులువుగా క్యాచ్ అందుకున్నాడు. దీంతో.. ఆస్ట్రేలియా జట్టు 134 పరుగుల మూడో వికెట్ కోల్పోయింది. అంతకముందు అరోన్ ఫించ్ (50: 105 బంతుల్లో 6x4)తో కలిసి తొలి వికెట్‌కి 112 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన హారిస్.. భారత్ బౌలర్లపై పూర్తి స్థాయిలో ఆధిపత్యం చెలాయించాడు. ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ బౌలింగ్‌లో వరుస ఫోర్లు బాదాడు. దీంతో.. ప్రమాదకరంగా కనిపించిన అతడ్ని ఎట్టకేలకి భారత్ పెవిలియన్ బాట పట్టించగలిగింది. అరోన్ ఫించ్ ఔటైన తర్వాత వచ్చిన ఉస్మాన్ ఖవాజా (5: 38 బంతుల్లో) జట్టు స్కోరు 130 వద్ద ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.