యాప్నగరం

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కి నటరాజన్‌కి పిలుపు.. శార్ధూల్ కూడా

గాయపడిన ఉమేశ్ యాదవ్ స్థానంలో ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ టి. నటరాజన్‌‌ని టీమ్‌లోకి భారత సెలెక్టర్లు ఎంపిక చేశారు. జనవరి 7 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య సిడ్నీ వేదికగా మూడో టెస్టు మ్యాచ్ జరగనుంది.

Samayam Telugu 1 Jan 2021, 5:23 pm
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆడుతూ గాయపడిన భారత ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్ స్థానంలో మరో ఇద్దరు పేసర్లని జట్టులోకి భారత సెలెక్టర్లు ఎంపిక చేశారు. అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బ్యాటింగ్ చేస్తుండగా.. మహ్మద్ షమీ మోచేతికి గాయమైంది. ఆ తర్వాత మెల్‌బోర్న్‌లో జరిగిన రెండో టెస్టులో బౌలింగ్ చేస్తూ ఉమేశ్ యాదవ్ గాయపడ్డాడు. దాంతో.. ఈ ఇద్దరి స్థానాల్లో శార్ధూల్ ఠాకూర్, నటరాజన్‌ని ఎంపిక చేసినట్లు బీసీసీఐ అధికారికంగా శుక్రవారం ప్రకటించింది.
Samayam Telugu T Natarajan (Image Credit: Twitter)


ఐపీఎల్ 2020 సీజన్‌లో రాణించడం ద్వారా భారత్ జట్టులోకి ఇటీవల ఎంపికైన నటరాజన్.. ఆస్ట్రేలియాతో వన్డే, టీ20 సిరీస్‌లో మెరుగ్గా రాణించాడు. దాంతో.. టెస్టుల్లోకి ఈ ఎడమచేతి వాటం పేసర్‌ని తీసుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్స్ వినిపించాయి. మెల్‌బోర్న్‌ టెస్టులోనూ ఐదుగురు బౌలర్లతో ఆడిన టీమిండియాలో.. కనీసం ఒకరైన ఎడమచేతి వాటం బౌలర్ ఉండింటే..? బాగుండేదనే అభిప్రాయాలు వినిపించాయి. దాంతో.. నటరాజన్‌ని టెస్టు జట్టులోకి ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

భారత్, ఆస్ట్రేలియా మధ్య జనవరి 7 నుంచి సిడ్నీ వేదికగా మూడో టెస్టు మ్యాచ్ జరగనుండగా.. మెల్‌బోర్న్ టెస్టులో గెలవడం ద్వారా నాలుగు టెస్టుల సిరీస్‌ని భారత్ 1-1తో సమం చేసింది. దాంతో.. సిడ్నీ టెస్టులోనూ గెలవాలని టీమిండియా పట్టుదలతో ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.