యాప్నగరం

బుమ్రాని ఎదుర్కొన్న బ్యాట్స్‌మెన్‌కి పీడకలలే..!

జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌ని ఎదుర్కోమని ఏ బ్యాట్స్‌మెన్‌కి చెప్పినా..? అతనికి పీడకలలు రావడం తథ్యం. ఎందుకంటే.. బుమ్రా ఇటీవల కాలంలో చాలా ప్రమాదకరంగా మారాడు. -బ్రాడ్ హడ్జ్

Samayam Telugu 1 Jan 2019, 6:26 pm
భారత ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాని ఎదుర్కోవడం ఏ బ్యాట్స్‌మెన్‌కైనా కష్టమేనని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హడ్జ్ అభిప్రాయపడ్డాడు. మెల్‌బోర్న్ వేదికగా ఆదివారం ముగిసిన మూడో టెస్టు మ్యాచ్‌లో 9 వికెట్లు పడగొట్టిన జస్‌ప్రీత్ బుమ్రా.. భారత్‌కి 137 పరుగుల తేడాతో అలవోక విజయాన్ని అందించాడు.
Samayam Telugu ..


టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన ఏడాదిలోనే అత్యధిక టెస్టు వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా మెల్‌బోర్న్ టెస్టుతో బుమ్రా రికార్డుల్లో నిలిచాడు. 2018, జనవరిలో భారత టెస్టు జట్టులోకి వచ్చిన ఈ పేసర్.. గత ఏడాది 9 టెస్టులాడి ఏకంగా 48 వికెట్లు పడగొట్టాడు. సిడ్నీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ గురువారం నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో.. ఈరోజు బ్రాడ్ హడ్జ్ మీడియాతో మాట్లాడాడు.

‘జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌ని ఎదుర్కోమని ఏ బ్యాట్స్‌మెన్‌కి చెప్పినా..? అతనికి పీడకలలు రావడం తథ్యం. ఎందుకంటే.. బుమ్రా ఇటీవల కాలంలో చాలా ప్రమాదకరంగా మారాడు. అతని బౌలింగ్‌లో వేగం, కచ్చితత్వం‌‌ ఉంది. అంతేకాకుండా బంతి నుంచి రెండు వైపులా అతను స్వింగ్ రాబట్టగలుగుతున్నాడు. అత్యుత్తమ టెస్టు బౌలర్‌కి ఉండాల్సిన ప్రధాన లక్షణాలివే..!’ అని బ్రాడ్ హడ్జ్ కితాబిచ్చాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.