యాప్నగరం

Ramakant Achrekar: నాలుగో టెస్టులో ‘నల్ల బ్యాడ్జీ’లతో భారత క్రికెటర్లు

ముంబయిలోని శివాజీ పార్క్‌లో క్రికెట్ శిక్షకుడిగా మారిన అచ్రేకర్.. 11ఏళ్ల వయసులోనే సచిన్ టెండూల్కర్‌ అసాధారణ ప్రతిభని గుర్తించి సానబెట్టాడు.

Samayam Telugu 3 Jan 2019, 11:11 am
భారత్, ఆస్ట్రేలియా మధ్య సిడ్నీ వేదికగా గురువారం ఆరంభమైన నాలుగో టెస్టులో ఇరు జట్ల ఆటగాళ్లు ‘బ్లాక్ రిబ్బన్‌‌’ని చేతికి ధరించి మ్యాచ్ ఆడుతున్నారు. సచిన్ టెండూల్కర్ గురువు, దిగ్గజ కోచ్ రమాకాంత్ అచ్రేకర్ నిన్న ముంబయిలోని తన స్వగృహంలో మరణించడంతో అతనికి ఈరోజు నివాళి అర్పించిన క్రికెటర్లు.. నల్ల బ్యాడ్జీలు ధరించి టెస్టు మ్యాచ్ ఆడుతున్నారు. 1932, జనవరి 2న మహారాష్ట్రలో జన్మించిన అచ్రేకర్.. సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ, అజిత్ అగర్కార్, రమేశ్ పొవార్ తదితర క్రికెటర్ల‌కి శిక్షణ ఇచ్చారు.
Samayam Telugu 100


1943లో క్రికెట్ కెరీర్‌ని ఆరంభించిన అచ్రేకర్.. 1945లో తొలిసారి న్యూ హింద్ స్పోర్ట్స్ క్లబ్ తరఫున ఆడాడు. ఆ తర్వాత.. 1963లో ఎస్‌బీఐ తరఫున గోల్డ్‌కప్ క్రికెట్ టోర్నీలో మ్యాచ్ ఆడిన ఈ కోచ్ దిగ్గజం క్రికెట్ కెరీర్ కేవలం ఒక్క ఫస్ట్ క్లాస్‌ మ్యాచ్‌కే పరిమితమైంది. ఆ తర్వాత ముంబయిలోని శివాజీ పార్క్‌లో క్రికెట్ శిక్షకుడిగా మారిన అచ్రేకర్.. 11ఏళ్ల వయసులోనే సచిన్ టెండూల్కర్‌ అసాధారణ ప్రతిభని గుర్తించి సానబెట్టాడు. 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో సచిన్ టెండూల్కర్ ఎన్నో సరికొత్త రికార్డుల్ని నెలకొల్పిన విషయం అందరికీ తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.