యాప్నగరం

కుంబ్లే లెఫ్ట్ హ్యండ్‌తో బౌలింగ్.. ఎందుకంటే?

టీమిండియా కోచ్, దిగ్గజ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే ఎడమ చేత్తో బౌలింగ్ చేయడం ఎప్పుడైనా చూశారా?

TNN 10 Mar 2017, 3:59 pm
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే.. నెట్స్‌లో లెఫ్ట్ హ్యాండ్‌తో బౌలింగ్ చేశాడు. పుజారా బ్యాటింగ్ చేస్తుండగా.. కుంబ్లే ఎడమ చేత్తో బంతిని స్పిన్ చేస్తూ బంతులు విసిరాడు. కుడి చేతి వాటం లెగ్ స్పిన్నర్ అయిన కుంబ్లే ఎడమ చేత్తో ఎందుకు బౌలింగ్ వేశాడనే కదా మీ అనుమానం. ఆసీస్ లెఫ్టార్మ్ స్పిన్నర్ ఒకీఫ్‌ను ఎదుర్కోవడం కోసం కుంబ్లే ఇలా బౌలింగ్ చేశాడు. లెఫ్టార్మ్ స్పిన్నర్ బౌలర్ ఏ కార్నర్ నుంచి బౌలింగ్‌కు వస్తున్నాడు, బంతి ఏ యాంగిల్లో వస్తుందనే విషయాన్ని బ్యాట్స్‌మెన్ అర్థం చేసుకోవడం కోసం కుంబ్లే ఇలా బౌలింగ్ చేశాడు. జంబో వేసిన బంతిని మిడాన్ వైపు ఆడే క్రమంలో పుజారా బౌల్డయ్యాడు. కుడి చేతి వాటం బౌలర్ అయినప్పటికీ.. ఎడమ చేత్తోనూ కుంబ్లే చక్కగా బౌలింగ్ వేశాడని పుజారా చెప్పాడు. శ్రీధర్ బౌలింగ్‌లోనూ పుజారా ప్రాక్టీస్ చేశాడు.
Samayam Telugu india vs australia anil kumble bowls left handed
కుంబ్లే లెఫ్ట్ హ్యండ్‌తో బౌలింగ్.. ఎందుకంటే?


బెంగళూరు టెస్టులో స్టార్క్‌ను ఎదుర్కోవడం కూడా నెట్స్‌లో సాధన చేసినట్లు పుజారా తెలిపాడు. వికెట్లకు దూరం వెళ్తున్న బంతిని ఎలా ఆడాలో ప్రాక్టీస్ చేశానని చెప్పాడు. శరీరానికి దూరంగా బంతి వెళ్లేటప్పుడు ఏ షాట్ ఆడాలో తెలుసుకోవడానికి నెట్స్‌లో శ్రమించానని పుజారా చెప్పాడు.

Ever seen @anilkumble1074 bowl left-arm spin? Answers to the "why" on https://t.co/uKFHYdKZLG soon #TeamIndia #INDvAUS pic.twitter.com/Xf7Lt7Gtqd — BCCI (@BCCI) March 10, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.