యాప్నగరం

వార్నర్‌ బౌల్డ్.. అశ్విన్ ఖాతాలో మరో రికార్డు

బెంగళూరు టెస్టులో వార్నర్ వికెట్ తీసిన అశ్విన్.. టెస్టుల్లో అత్యధికసార్లు వార్నర్‌ను ఔట్ చేసిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు.

TNN 5 Mar 2017, 10:38 am
బెంగళూరు టెస్టులో రెండో రోజు ఉదయాన్నే వార్నర్ వికెట్ తీసిన అశ్విన్ భారత్‌కు శుభారంభం అందించాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసిన ఆసీస్.. రెండో రోజు మరో 12 పరుగులు జోడించాక వార్నర్ వికెట్ కోల్పోయింది. అశ్విన్ విసిరిన అద్భుతమైన డెలివరీకి వార్నర్ (33) బౌల్డ్ అయ్యాడు. టెస్టుల్లో అశ్విన్ బౌలింగ్‌లో డేవిడ్ ఔట్ కావడం ఇది ఎనిమిదోసారి కావడం విశేషం. ఇప్పటి వరకూ అశ్విన్ ఎక్కువసార్లు ఔట్ చేసిన బ్యాట్స్‌మెన్ వార్నరే కాగా, వార్నర్ కూడా అశ్విన్ బౌలింగ్‌లోనే ఎక్కువసార్లు పెవిలియన్ చేరాడు. ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ వార్నర్‌ను ఏడుసార్లు ఔట్ చేశాడు. ఓవరాల్‌‌గా చూస్తే అశ్విన్ పదిసార్లు వార్నర్‌ను పెవిలియన్‌కు పంపాడు.
Samayam Telugu india vs australia ashwin dismissed warner for the 8th time in tests
వార్నర్‌ బౌల్డ్.. అశ్విన్ ఖాతాలో మరో రికార్డు



ఇషాంత్ శర్మ బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి క్రీజ్ వెలుపలికి వచ్చి బ్యాటింగ్ చేసిన వార్నర్.. అశ్విన్ బౌలింగ్‌ను మాత్రం ఎదుర్కోలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 189 పరుగులకు ఆలౌట్ కాగా, 25 ఓవర్లు ముగిసే సమయానికి ఆస్ట్రేలియా వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. ఓపెనర్ రెన్‌షా 16 పరుగులతో, స్మిత్ 2 రన్స్‌తో క్రీజులో ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.