యాప్నగరం

మరో స్పిన్ అస్త్రం.. కుల్దీప్ యాదవ్

రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్‌తో పటిష్టంగా ఉన్న స్పిన్ విభాగంలోకి మరో కొత్త స్పిన్నర్‌ వచ్చాడు.

TNN 14 Feb 2017, 4:10 pm
స్వదేశంలో భారత్‌కు స్పిన్నే ప్రధాన ఆయుధం. పిచ్‌లు కూడా స్పిన్‌కు అనుకూలంగానే తయారు చేస్తారు. ఇప్పటికే ఈ టెక్నిక్‌ను ఉపయోగించి భారత్ ఎన్నో విజయాలు అందుకుంది. గతేడాది న్యూజిలాండ్, ఈ ఏడాది జనవరిలో ఇంగ్లండ్ భారత స్నిన్ ఉచ్చులో చిక్కుకున్నవే. ప్రస్తుతం ఆస్ట్రేలియాపై కూడా ఇదే సూత్రాన్ని టీం ఇండియా అమలు చేయనుంది. అందుకనే రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్‌తో పటిష్టంగా ఉన్న స్పిన్ విభాగంలోకి మరో కొత్త స్పిన్నర్‌ను సెలక్టర్లు తీసుకొచ్చారు. అతనే కుల్దీప్ యాదవ్.
Samayam Telugu india vs australia chinaman kuldeep yadav joined with ashwin and jadeja
మరో స్పిన్ అస్త్రం.. కుల్దీప్ యాదవ్


వాస్తవానికి బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌కు కుల్దీప్ ఎంపికయ్యాడు కానీ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇప్పుడు ఆస్ట్రేలియాతో భారత్ నాలుగు టెస్టులు ఆడుతుంది కాబట్టి, కుల్దీప్‌కు ఛాన్స్ ఉండొచ్చు. కాగా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ 22 ఏళ్ల ఎడమచేతి వాటం స్పిన్నర్‌కి ఓ ప్రత్యేకత ఉంది. భారత తొలి చైనామ్యాన్‌ బౌలర్‌గా కుల్దీప్ గుర్తింపు తెచ్చుకున్నాడు. అంటే కుడిచేతి వైపు నుంచి పరిగెత్తి ఎడమచేతి వైపు వెళ్లి బౌలింగ్ చేయడం. ఆస్ట్రేలియా మాజీ స్నిన్నర్ బ్రాడ్ హాగ్ కూడా చైనామ్యాన్ బౌలరే.

కాగా, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మంచి ప్రదర్శన కనబరుస్తున్న కుల్దీప్‌‌పై సెలక్టర్లు దృష్టి పెట్టారు. జనవరిలో భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లండ్ జట్టుతో ప్రాక్టీస్ మ్యాచ్‌లో తలపడిన ఇండియా-ఎ జట్టులో కుల్దీప్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో 5 వికెట్లు పడగొట్టిన కుల్దీప్ సెలక్టర్లను ఆకర్షించాడు. దీంతో బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టుకు అతన్ని ఎంపిక చేసారు. ఆ టెస్టులో ఆడే అవకాశం రానప్పటికీ ఆసీస్ సిరీస్‌కు కూడా ఎంపిక చేసారు. మరి ఈసారైనా తన టాలెంట్ నిరూపించుకోవడానికి కుల్దీప్‌కు అవకాశం వస్తుందో లేదో చూడాలి.

ఇప్పటి వరకు 22 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన కుల్దీప్ యాదవ్.. 33.11 సగటుతో 81 వికెట్లు పడగొట్టాడు. అలాగే బ్యాటింగ్‌లో కూడా రాణిస్తున్నాడు. 28.92 సగటుతో 723 పరుగులు చేసాడు. దీనిలో ఒక సెంచరీ కూడా ఉంది. ప్రస్తుతం ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కుల్దీప్ ఆడుతున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.