యాప్నగరం

జడేజా హాఫ్ సెంచరీ.. భారత్‌కు 32 పరుగుల ఆధిక్యం

ధర్మశాల వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న చివరి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 332 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

TNN 27 Mar 2017, 11:50 am
ధర్మశాల వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న చివరి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 332 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో టీమిండియాకు 32 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. 248/6తో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్‌ను ఓవర్ నైట్ బ్యాట్స్‌మెన్లు రవీంద్ర జడేజా, సాహాలు ముందుకు నడిపారు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 96 రన్స్ జోడించారు. భారత్ భారీ ఆధిక్యం సాధిస్తుందని భావిస్తోన్న దశలో కమిన్స్ దెబ్బతీశాడు. 95 బంతుల్లో 63 రన్స్ చేసిన జడేజాను పెవిలియన్‌కు పంపిన కమిన్స్ మరుసటి ఓవర్లో సాహా (31)ను బలిగొన్నాడు.
Samayam Telugu india vs australia india all out for 332 in first innings
జడేజా హాఫ్ సెంచరీ.. భారత్‌కు 32 పరుగుల ఆధిక్యం


చివరి వికెట్‌కు కుల్దీప్ యాదవ్ (7), ఉమేశ్ యాదవ్ 14 పరుగులు జోడించారు. లియాన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన కుల్దీప్ హేజిల్‌వుడ్‌కు క్యాచ్ ఇవ్వడంతో భారత్ 332 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

భారత ఆటగాళ్లలో రాహుల్, పుజారా, జడేజా అర్ధ సెంచరీలు సాధించగా.. రహానే (46), సాహా ఫర్వాలేదనిపించారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లియాన్ 92 పరుగులిచ్చి 5 వికెట్లు తీసుకోగా.. ప్యాట్ కమిన్స్‌కు 3 వికెట్లు దక్కాయి. హేజిల్‌వుడ్, ఒకీఫ్‌లకు తలో వికెట్ లభించింది. మరో రెండున్నర రోజులకు పైగా ఆట మిగిలి ఉండటంతో.. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ను తక్కువ పరుగులకే ఆలౌట్ చేస్తే టీమిండియా విజయావకాశాలు మెరుగవుతాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.