యాప్నగరం

లైఫ్ ఇచ్చారు.. హాఫ్ సెంచరీ బాదేసి అవుటయ్యాడు

ఆసీస్‌తో జరుగుతున్న చివరి టెస్టులో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ అర్ధ సెంచరీ సాధించాడు. 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద క్యాచ్ అవుట్ అయ్యే ప్రమాదం నుంచి బయటపడిన రాహుల్..

TNN 26 Mar 2017, 1:06 pm
ధర్మశాల: ఆసీస్‌తో జరుగుతున్న చివరి టెస్టులో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ అర్ధ సెంచరీ సాధించాడు. 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద క్యాచ్ అవుట్ అయ్యే ప్రమాదం నుంచి బయటపడిన రాహుల్.. హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. ఈ సిరీస్‌లో నిలకడగా రాణిస్తోన్న రాహుల్‌కు గత నాలుగు టెస్టుల్లో ఇది ఐదో అర్ధ సెంచరీ కావడం విశేషం. ఇన్నింగ్స్ 11వ ఓవర్లో 21 పరుగుల వద్ద ఓపెనర్ మురళీ విజయ్ పడగొట్టిన ఆసీస్.. తర్వాతి ఓవర్లో రాహుల్‌ను ఔట్ చేసే చక్కటి అవకాశాన్ని కోల్పోయింది.
Samayam Telugu india vs australia kl rahul half century helps india in strong position
లైఫ్ ఇచ్చారు.. హాఫ్ సెంచరీ బాదేసి అవుటయ్యాడు


కమిన్స్ విసిరిన బంతి రాహుల్ బ్యాట్ అంచును తాకుతూ ఫస్ట్ స్లిప్‌లో ఉన్న రెన్‌షా మీదుగా వెళ్లిపోయింది. ఫ్లయింగ్ సాసర్‌ తరహాలో దూసుకెళ్లిన బంతి వేగాన్ని రెన్‌షా అంచనా వేయలేకపోయాడు. దీంతో బంతి అతడి చేతుల్ని తాకుతూ బౌండరీకి చేరింది.

ఈ లైఫ్‌ను రాహుల్ (60) చక్కగా వినియోగించుకున్నాడు. పుజారా (29 నాటౌట్) తో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. వీరిద్దరూ వికెట్‌కే ప్రాధాన్యం ఇవ్వడంతో ఒకానొక దశలో పరుగులు రావడమే కష్టమైంది. తొలి రోజు మొదటి సెషన్లో ఆసీస్ 131 పరుగులు చేయగా భారత్ అందులో సగం రన్స్ మాత్రమే చేయగలిగింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 300 పరుగులకు ఆలౌట్ కాగా, టీమిండియా 40.2 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. కమిన్స్ బౌలింగ్‌లో అవుటయ్యే అవకాశం నుంచి తప్పించుకున్న రాహుల్.. మళ్లీ అతడికి తన వికెట్ ఇచ్చుకోవడం విశేషం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.