యాప్నగరం

Sydney Test: ఆస్ట్రేలియా గడ్డపై తీరు మార్చుకోని కేఎల్ రాహుల్.. ఫ్యాన్స్ ఫైర్

ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ హేజిల్‌వుడ్ ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా విసిరిన బంతిని కేఎల్ రాహుల్ (9: 6 బంతుల్లో 2x4) వెంటాడే ప్రయత్నం చేశాడు. దీంతో.. బ్యాట్ అంచున తాకిన బంతి ఫస్ట్ స్లిప్‌లోకి దూసుకెళ్లగా.. ఫీల్డర్ షాన్ మార్ష్ ఎలాంటి తడబాటు లేకుండా సులువుగా క్యాచ్ అందుకున్నాడు.

Samayam Telugu 3 Jan 2019, 8:29 am
ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌లో వరుసగా విఫలమవుతున్న భారత ఓపెనర్ కేఎల్ రాహుల్‌పై అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సిడ్నీ వేదికగా గురువారం ఆరంభమైన నాలుగో టెస్టు మ్యాచ్‌లో ఓపెనర్‌గా మళ్లీ తుది జట్టులో చోటు దక్కించుకున్న కేఎల్ రాహుల్.. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లోనే పేలవంగా వికెట్ చేజార్చుకున్నాడు.
Samayam Telugu prithvi-shaw-must-replace-kl-rahul-in-5th-test-for-india1400-1535973094_1100x513


ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ హేజిల్‌వుడ్ ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా విసిరిన బంతిని కేఎల్ రాహుల్ (9: 6 బంతుల్లో 2x4) వెంటాడే ప్రయత్నం చేశాడు. దీంతో.. బ్యాట్ అంచున తాకిన బంతి ఫస్ట్ స్లిప్‌లోకి దూసుకెళ్లగా.. ఫీల్డర్ షాన్ మార్ష్ ఎలాంటి తడబాటు లేకుండా సులువుగా క్యాచ్ అందుకున్నాడు. హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ ఔటవడం ఇది నాలుగోసారి కావడం కొసమెరుపు.

వాస్తవానికి కేఎల్ రాహుల్ పేలవ ఫామ్ కారణంగా అతనిపై మూడో టెస్టులో వేటు పడింది. కానీ.. రోహిత్ శర్మ తన భార్య ప్రసవించడంతో భారత్‌కి వచ్చేయగా.. ప్రయోగాత్మక ఓపెనర్‌ హనుమ విహారిని మిడిలార్డర్‌లోకి మార్చి.. మళ్లీ ఓపెనర్‌గా కేఎల్ రాహుల్‌కి ఈ టెస్టులో ఛాన్సిచ్చారు. అయితే.. మరోసారి ఆ అవకాశాన్ని రాహుల్ చేజార్చుకుని కెరీర్‌ని ప్రశ్నార్థకం చేసుకున్నాడు.


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.