యాప్నగరం

ధోనీలో ఈ టాలెంట్ కూడా ఉందా..?

మైదానంలో భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీలో చాలా నైపుణ్యాలు కనిపిస్తుంటాయి. ఒకప్పుడు జట్టు కెప్టెన్‌గా

TNN 21 Sep 2017, 3:23 pm
మైదానంలో భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీలో చాలా నైపుణ్యాలు కనిపిస్తుంటాయి. ఒకప్పుడు జట్టు కెప్టెన్‌గా భారత్‌కి ఎన్నో అపురూపమైన విజయాలు అందించాడు. ప్రపంచంలోనే బెస్ట్ మ్యాచ్ ఫినిషర్‌గా గుర్తింపు పొందాడు. ఇక అతని వికెట్ కీపింగ్ గురించి చెప్పాలంటే.. వన్డేల్లో 100కి పైగా స్టంపౌట్స్ చేసిన ఏకైక వికెట్‌ కీపర్‌గా క్రికెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డు నెలకొల్పాడు.
Samayam Telugu india vs australia rain forces ms dhoni to pick up the gun
ధోనీలో ఈ టాలెంట్ కూడా ఉందా..?


క్రీజు వద్ద ఉన్న వికెట్లని చూడకుండానే గురి తప్పకుండా బంతిని విసిరి బెయిల్స్ పడగొట్టే మహేంద్రసింగ్ ధోనీలో ఒక షూటర్ కూడా ఉన్నాడని తాజాగా వెల్లడైంది. వర్షం కారణంగా బుధవారం భారత జట్టుకి ప్రాక్టీస్ సెషన్ రద్దవడంతో కోల్‌కతాలోని పోలీస్ ట్రైనింగ్ స్కూల్‌కి వెళ్లిన ధోనీ అక్కడ పిస్టల్‌తో షూటింగ్‌ ప్రాక్టీస్ చేశాడు. ఎలాంటి అనుభవం లేకపోయినా.. ధోనీలో ఉన్న షూటింగ్ గురికి పోలీసులే ఆశ్చర్యపోయారట. పద్మభూషణ్ కోసం ధోనీ పేరుని బీసీసీఐ బుధవారం సిఫార్సు చేసిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.